Rythubandhu Day 2: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు కార్యక్రమం ఆపందుకుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతుబంధు చెందాలన్న సీఎం కెసిఆర్ ఆశయం మేరకు ఆర్ధిక శాఖ ఆ దిశగా బడ్జెట్ కూర్పు చేసింది. నిన్న మంగళవారం ప్రారంభమైన రైతుబంధు కార్యక్రమంలో భాగంగా రూ.544 కోట్లు సర్కారు విడుదల చేసి రైతుల ఖాతాలో జమ చేసింది. కాగా నేడు బుధవారం రూ.1255.42 కోట్లు రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలో జమ చేసింది సర్కారు. మొత్తంగా నిన్న, నేడు కలిపి రూ.1799.99 కోట్లు రైతుల ఖాతాలలోకి జమ అయ్యాయి. దీంతో నిన్న , నేడు కలిపి 35,43,783 మంది రైతులు లబ్ది పొందారు.
Telangana Farmers రైతుబంధు రెండవ రోజు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి Minister Niranjan Reddy మాట్లాడారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ…రైతు కష్టం తెలిసిన నేత కేసీఆర్ అని అన్నారు. రైతుబంధు ఉద్దేశం డబ్బుల పంపిణీ కాదు. సమైక్య పాలనలో నిర్వక్ష్యానికి గురైనా వ్యవసాయ రంగంలోని ప్రతి ఎకరం సాగులోకి రావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశం. గత ఏడేండ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో పంటల ఉత్పత్తులు వందశాతం పైగా పెరిగాయన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. సాగు, పంట ఉత్పత్తులు పెరగడంతో అనేక రంగాలకు ఉపాధి లభించింది. వ్యవసాయాన్ని వ్యాపారంగా కాకుండా ప్రభుత్వాలు ఉపాధి రంగంగా చూడాలని సూచించారు. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. దేశంలో అలా చూసిన ఒకే ఒక్క నేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని సీఎంపై ప్రశంసలు కురిపించారు. Rythubandhu Day 2
దేశంలో దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ వచ్చిన వెంటనే వ్యవసాయ రంగం మీద దృష్టి సారించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రూ.60 వేల కోట్లు వ్యవసాయ రంగం మీద ఖర్చుపెడుతున్నారు. కరోనా విపత్తులో ప్రభుత్వాల ఆదాయం తగ్గిపోయినా రైతుల కోసం రైతుబంధు వంటి వ్యవసాయ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగిస్తున్నారని చెప్పారు. Telangana Rythubandhu Scheme 2021