kaleshwaram farmers పుడమితల్లినే నమ్ముకున్న రైతు… పుట్టినప్పటి నుంచి మట్టితోనే సహవాసం చేస్తున్నాడు. ఊపిరి వదిలేవరకు మట్టి మనిషిగానే బతకాలనుకుంటాడు. కానీ అభివృద్ధి పేరుతో ప్రాజెక్టుల నిర్మాణానికి రైతుల నుంచి భూమిని లాక్కుంటున్నారు అధికారులు. దానికి తగిన పరిహారం కూడా ఇవ్వకుండా అమాయక రైతుల పాలిట శాపంగా మారుతున్నారు. ఇప్పటికే ఎంతో భూమిని కోల్పోయాము, మళ్ళీ సర్వేల పేరుతో భూమిని కోల్పోమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చావనైనా చస్తాం.. మా భూముల్లో సర్వేలను జరపనివ్వమంటూ తేల్చేశారు రైతులు. వివరాలలోకి వెళితే.
కాళేశ్వరం ప్రాజెక్టు Kaleshwaram Project నుంచి మిడ్ మానేరుకు మూడో టీఎంసీ నీటిని తరలించేందుకు ప్రస్తుతం ఉన్న వరద కాలువకు సమాంతరంగా మరో కెనాల్ ను నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం భూ సర్వే చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల Siricilla జిల్లా బోయినిపల్లి మండలం విలాసాగర్లో భూ సర్వే చేపట్టిన రెవెన్యూ ఆఫీసర్లను స్థానిక రైతులు అడ్డుకున్నారు. ఇప్పటికే మొదటి వరద కాలువ కింద భూములు కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నాము. చావనైనా చస్తాం కానీ మరోసారి భూమి ఇవ్వబోమంటూ అధికారులతో వాగ్వాదానికి దిగారు రైతులు. దీంతో అధికారులు స్థానిక తహసీల్దార్ కు సమాచారం అందించారు. తహసీల్దార్ యుగంధర్ అక్కడికి చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు.
మొదటి కాలువ కింద భూములు కోల్పోయిన రైతులు మళ్లీ భూమి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు భూమికి బదులు భూమి ఇవ్వాలని, లేకుంటే ఎకరాకు రూ. 40 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏదో ఒకటి చెప్పేవరకు తమ భూములను సర్వే చేయడానికి వీల్లేదని అన్నారు. ఎంత చెప్పినా రైతులు వినకపోవడంతో రెవెన్యూ అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై అభిలాష్ అక్కడికి వచ్చి అధికారులకు సహకరించాలని రైతులకు సూచించారు. 15 రోజుల్లోగా తమ సమస్యను పరిష్కరించాలని, లేకుంటే ఎప్పుడు సర్వేకు వచ్చినా అడ్డుకుంటామని చెబుతూ రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. kaleshwaram farmers
కాగా.. 1894లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో మొదటిసారి భూ సేకరణ చట్టం తెచ్చింది. ఈ చట్టం ఆధారంగానే దాదాపు 120 సంవత్సరాల పాటు మన దేశంలో ప్రభుత్వాలు భూ సేకరణ చేశాయి. భూములను బలవంతంగా తీసుకోవడానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఆందోళనలు తలెత్తాయి. kaleshwaram Project