ఆహారశుద్ది

చిరు ధాన్యాలతో ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్…

0
healthy breakfast

Healthy Whole-Grain Breakfasts ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తీరిక లేని ఉద్యోగాలు చేస్తున్న అందరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గింది. డబ్బు సంపాదనే ద్వేయంగా బ్రతుకు జీవనం కొనసాగిస్తుంది నేటి సమాజం. సాంప్రదాయ ఆహారాన్ని పక్కనపెట్టేసి విషపు ఆహారాన్ని లొట్టలేసుకుంటూ తినేస్తున్న రోజులివి. కానీ కరోనా మహమ్మారి కారణంగా అందరిలోనూ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. అందుకోసం ఇమ్యూనిటీ పవర్ ని పెంచుకోవడానికి దారులు వెతుకుతున్నారు. ఇక ఆహారపు అలవాట్లలో మార్పులు జరగకపోతే ఆ ప్రభావం ఆరోగ్యంపై పడే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. Healthy Whole-Grain Breakfasts

healthy breakfast

ఆరోగ్యంగా ఉండాలంటే పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. మన తాత ముత్తాతలు బలమైన ఆహారాన్ని తీసుకోవడం మూలాన 100 ఏళ్లకు పైగా బ్రతికారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 ఏళ్లకే గుండె సంబంధిత వ్యాధులు, బిపి, షుగర్, అలసట లాంటి రోగాలు బారీన పడుతున్నారు. మరి కాస్త ఆరోగ్యం, మరియు తీసుకునే ఆహారంపై శ్రద్ధ పెడితే మీరు కూడా ఆరోగ్య వంతులుగా మారి పది మందికి ఆదర్శంగా నిలవొచ్చు. ప్రస్తుతం వ్యవసాయం కూడా కల్తీ అయిపోయింది. విధేశ్చగా రసాయన ఎరువులు వినియోగం పెరిగింది. కానీ పూర్వ కాలంలో మెట్ట పంటలైన చిరు ధాన్యాలను ఎక్కువగా సాగు చేసేవారు. వీటినే అప్పటి వారు ప్రధాన ఆహారపు అలవాటుగా చేసుకున్నారు. చిరు ధాన్యాల్లో ముఖ్యమైనవి జొన్నలు, సజ్జలు, కొర్రలు, వరిగలు, రాగులు, అరికలు, అండు కొర్రలు, ఊదలు, అవిసెలు, సామలు సాగు చేసి వందేళ్లు జీవనం సాగించారు. Small Grains

healthy breakfast

కొర్రలు ( Korralu )రెండు రకాలు రుచిని కలిగి ఉంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొర్రలు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి తీపి, వగరు రుచులను కలిగి ఉండటం వల్ల వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అంటున్నారు. అంతేకాకుండా దీంట్లో అధిక పీచు, మాంసకృత్తులు , ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, తదితర విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. మూత్రంలో మంట, కడుపు నొప్పి, అతిసారం, ఆకలి లేకపోవడం మొదలైన సమస్యలకు మంచి ఔషధంగా పని చేస్తాయని, కాలిన గాయాలు, రక్తహీనత, ఊబకాయం, రక్తస్రావం, కీళ్లవాతం, గుండెజబ్బుల నుంచి త్వరగా కోలు కోవడానికి కొర్రలు మంచిగా పనిచేస్తాని చెబుతున్నారు.

healthy breakfast

ఇక ఉదలు (Oodalu ) వల్ల ఉద్యోగులకు ఎంతో మేలు చేస్తుంది. దానికి కారణం ఏంటంటే…ఇవి శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతాయి. ఉద్యోగులు తమ సంస్థల్లో ఎక్కువసేపు కూర్చుని పని చేస్తారు. అయితే వారికీ శారీరక శ్రమ లేని వారికి ఊదలు మంచి ఆహారమని, వీటిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల మలబద్ధకం, మధు మేహానికి మంచిగా పనిచేస్తాయని చెబుతున్నారు వైద్యులు.

arikelu

అదేవిధంగా చిరుధాన్యాల్లో ముఖ్యమైనవి అరికెలు ( Arikelu ). అరికెలలో విటమిన్లు, ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. కాన్సర్‌ లాంటి ప్రమాదకర వ్యాధులు రాకుండా అరికెలు నివారిస్తాయని న్యూట్రిషన్లు సూచిస్తున్నారు. రక్తంలో కోలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయని వీటిలో యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తాయని చెబుతున్నారు.

litte millets

చిరు ధాన్యాల్లో మరొకటి సామలు ( Samalu ). వీటిని ఆహారంగా తీసుకోవ డం వల్ల అనేక గ్యాస్‌ సమస్యలు తగ్గుతాయి. అతి­సారం, అజీర్ణం, సుఖ వ్యాధులు, శుక్ర­కణాల వృద్ధికి, ఆడవారిలో రుతు సమస్య లకు మంచి ఔషధంగా పని చేస్తాయని న్యూట్రీషన్లు సూచి­­స్తున్నారు. ముఖ్యంగా మైగ్రేన్‌ సమస్య ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తాయని చెబుతు­న్నారు. కీళ్ల నొప్పులు, ఊబ­కాయం, గుండె జబ్బుల నివారణకు ఇది మంచి ఆహారం.

అయితే ప్రస్తుతం అందరిలోనూ ఆరోగ్యంపై ఆసక్తి పెరగడంతో కొందరు చిరు ధాన్యాలతో ప్రత్యేకమైన అల్పాహారాన్ని తయారు చేసి అమ్ముతున్నారు. పలు హోటల్స్, రెస్టారెంట్స్ లలో చిరు ధాన్యాలను ఉపయోగించి బ్రేక్ ఫాస్ట్ తయారు చేయి ఆకట్టుకుంటున్నారు. వారికి ఆదాయమే కాకుండా వినియోగదారులకు ఆరోగ్యాన్నిస్తున్నారు. Whole Grain Breakfasts

Leave Your Comments

మరింతగా దిగి రానున్న వంట నూనె ధరలు

Previous article

పశుగ్రాస మ్యూజియాన్ని సందర్శించిన మంత్రి..

Next article

You may also like