49 acres of cannabis plantation destroyed in Vizag దేశంలో గంజాయి సాగు యధేచ్చగా సాగుతుంది. పోలీసులు ఎన్ని ఆపరేషన్ లు చేపట్టినా గంజాయి సాగుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో గంజాయి సాగు చేస్తూ రాష్ట్రాలు దాటిస్తున్నారు కొందరు స్మగ్లర్లు. విదేశాల్లో గంజాయి సాగు చట్టపరమే అయినప్పటికీ మన దేశంలో మాత్రం గంజాయి సాగు నిషేధం. దీంతో గంజాయి సాగుపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి సాగుతో ఎంతో భవిష్యత్తు ఉన్న యువతకు అలవాటు చేసి లక్షలు సంపాదిస్తున్నారు కేటుగాళ్లు. కాగా.. విశాఖ ఏజెన్సీలో గంజాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసు శాఖ, ఎస్‌ఈబీ బృందాలు గంజాయి తోటలపై వరుస దాడులు చేస్తున్నాయి. అందులో భాగంగా గంజాయి సాగుపై పోలీసులు స్పెషల్ ఆపరేషన్ లు నిర్వహిస్తున్నారు. తాజాగా విశాఖ మన్యంలో చేపట్టిన ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా భారీ గంజాయి సాగును గుర్తించారు.
49 acres of cannabis plantation గంజాయి సాగుపై ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పోలీసులు సీరియస్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు. ఆపరేషన్ పరివర్తన కార్యక్రమంలో గుంటూరులో భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇక ఉత్తరాంధ్రలో భారీగా సాగు చేస్తున్న గంజాయి తోటలను ధ్వంసం చేశారు. తెలంగాణలోనూ 64 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అయితే నిన్న ఆదివారం విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో గూడెం కొత్తవీధి మండలం, లక్కవరపు పేట పంచాయతీ పరిధిలో నేరెళ్లబంధ గ్రామంలో ఆపరేషన్ పరివర్తన చేపట్టారు పోలీసులు. గ్రామ సమీపంలో 49 ఏకరాల్లో సాగు చేస్తున్న గంజాయి పంటలను ధ్వంసం చేసారు. అనంతరం గ్రామస్థులకు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు. అంతకుముందు నవంబర్‌లో విశాఖపట్నం రూరల్ ఏజెన్సీ ప్రాంతంలో 5,500 ఎకరాల్లో గంజాయి సాగును ఆపరేషన్‌లో భాగంగా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. Vizag Cannabis