Two Punjab Farmers Killed In Road Accident ప్రభుత్వంపై గెలిచి విగతజీవులుగా మారారు రైతులు. కేంద్రం మెడలు వంచి మూడు వ్యవసాయ సాగు చట్టాలను వెనక్కి తీసుకునేలా చేసిన రైతులు నేడు స్వస్థలాలకు బయలుదేరారు. 15 నెలలుగా అలుపెరగని పోరాటం చేసిన ఆ రైతన్నలు విజయోత్సవ ర్యాలీ చేపట్టి ఆనందంగా తమ ఇళ్లకు వెళ్తున్న క్రమంలో మృత్యువు వెంటాడింది. లారీ రూపంలో వచ్చి కబళించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు రైతులు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో మరో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.
Punjab Protest Farmers పంజాబ్ కు చెందిన కొందరు రైతులు ఢిల్లీ సరిహద్దు టిక్రి నిరసన ప్రాంతం నుంచి ట్రాక్టర్ లో స్వస్థలానికి బయలుదేరారు. అయితే వారు హర్యానా లోని హిసార్ కు చేరుకోగా వారు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ ని లారీ డీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు రైతులు ప్రమాద స్థలంలోనే మృతి చెందినట్లు పోలీసులు దృవీకరించారు. చనిపోయిన వారిలో సుఖదేవ్ సింగ్ ( 40), అజయ్ ప్రీత్ సింగ్ ( 32 ) ఉన్నారు. ఈ ప్రమాదంలో రగ్బీర్ సింగ్ కు తీవ్ర గాయాలయ్యాయి. Two Punjab Farmers Killed
వందలాది మంది రైతులు ఢిల్లీ నిరసన ప్రాంతాన్ని ఖాళీ చేసిన నేపథ్యంలో ఢిల్లీ శివార్లలో భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు దృష్టిసారించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినప్పటికీ ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. Delhi Farmers Accident