Paddy Procurement Only Throuth Ryuthu Bharosa Centres రైతు సంక్షేమం కోసం సీఎం జగన్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. ఇప్పటికే రైతన్నల కోసం ఎరువులు, విత్తనాలు, రాయితీతో యంత్రాలను సరఫరా చేస్తుంది. ఇక రైతులకు అత్యంత మేలు చేసే ధాన్యం కొనుగోళ్ళకు సంబంధించి తీసుకున్న బృహత్తర నిర్ణయమే రైతు భరోసా కేంద్రాలు. రైతులు తమ ధాన్యాన్ని విక్రయించడానికి మండల కేంద్రాలకు పోవాల్సిన అవసరం లేకుండా తమ గ్రామాల్లోని ఆర్బీకే కేంద్రాల్లో ధాన్యం విక్రయించే వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం.
AP Paddy Procurement రైతు భరోసా కేంద్రాల పనితీరు, ఈ ఏడాది ఎంత మేర కేంద్రాల ద్వారా కొనుగోలు చేశారో వివరించారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు. ఏపీ వ్యవసాయ శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతు భరోసా కేంద్రాల్లోనే పంటను కొనుగోలు చేస్తున్నామని తెలిపారు మంత్రి కన్నబాబు. ఈ మేరకు అయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు ధాన్యం కొనుగోలులో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చేయడమే లక్ష్యంగా అందుబాటులోకి తీసుకొచ్చిన ఆర్బీకే కేంద్రాల్లోనే ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. దళారుల ప్రమేయం కానీ మిల్లర్ల ప్రమేయం లేకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నేరుగా అమ్ముకునే అవకాశం ఉంది అని స్పష్టం చేసారు. ఇక కొనుగోలు చేసిన 21 రోజుల్లోపే రైతుల ఖాతాల్లో డబ్బు చేరుతుందని మంత్రి చెప్పారు. Minister Kannababu
అయితే ఇటీవల భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరిగిందని, తూర్పు గోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, కడప, గుంటూరు జిల్లాలో వరి ఎక్కువగా దెబ్బతిన్నదని కన్నబాబు తెలిపారు. ఎక్కువ పంట దెబ్బతినడంతో పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. అయితే ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల మిల్లర్లు ముందుకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, తేమ శాతం అధికంగా ఉండటం కారణంగా ధాన్యం విరిగిపోవడం, నూకల శాతం పెరగడం వల్ల మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని, అయితే ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు మంత్రి కన్నబాబు. దాదాపుగా 7681 రైతు భరోసా కేంద్రాల్లో ( 7681 RBK Centres ) ధాన్యం కొనుగోలు చేపట్టామని, ఇప్పటివరకు 2 లక్షల 36 వేల 880 టన్నుల ధాన్యాన్ని కొనుగోలు జరిగిందన్నారు. కాగా.. ప్రతి ఆర్బీకే సెంటర్లకు మిల్లర్లని అనుసంధానం చేసినట్లు మంత్రి తెలిపారు. RBK Centres