Govt procures paddy worth nearly Rs 64000 cr దేశవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అంశంపై చర్చ జరుగుతుంది. పలు రాష్ట్రాల్లో ధాన్యం సేకరణ చేపట్టట్లేదంటూ ఆయా రాష్ట్రాలు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఇక తెలంగాణ పరిస్థితి గురించి వేరే చెప్పనవసరం లేదు. తెలంగాణలో యాసంగి పంట ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వద్ద ప్రతిపాదించింది. పలు మార్లు కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు జరిపింది. స్వయంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి సంబంధిత మంత్రులతో చర్చలు జరిపారు. కానీ కేంద్రం నుంచి స్పందన కరువైంది. తెలంగాణ యాసంగి పంటని కొనుగోలు చేసేందుకు నిరాకరించింది. Government procures paddy in 2021-22
ఇకపోతే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కేంద్రం ఎంత మేర పంట Govt procures paddy కొనుగోలు చేసిందో లెక్కలతో సహా వివరించింది. కేంద్ర ప్రభుత్వం 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సంవత్సరంలో ఇప్పటివరకు 326 లక్షల టన్నుల వరిని కనీస మద్దతు ధరతో దాదాపు 64,000 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలిపింది. డిసెంబర్ 8 నాటికి చండీగఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ మరియు కాశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కేరళ, తమిళనాడు, బీహార్ రాష్ట్రాలలో మొత్తం 326 లక్షల టన్నుల వరిని సేకరించారు. ఈ సేకరణ ద్వారా 63,897.73 కోట్ల ఎంఎస్‌పి కనీస మద్దతు ధరతో 25.94 లక్షల మంది రైతులు ( 25.94 lakh farmers )లబ్ది పొందినట్లు కేంద్రం తెలిపింది. ఇక గత సంవత్సరం మాదిరిగానే వరి సేకరణ సజావుగా సాగినట్లు కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. Indian Agriculture