వార్తలు

ఏపీలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు …

0
Andhra Pradesh paddy

ys jagan

Andhra Pradesh to speed up paddy procurement ఆంధ్రప్రదేశ్ లో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ఊపందుకుంది. ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియలో రాష్ట్ర పొరసరఫరాల శాఖ AP Civil Suppliesసరికొత్త ప్రణాళికలు అమలు చేస్తుంది. ఈ ఏడాది ఎక్కువ పంటని కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ మేరకు రైతు భరోసా కేంద్రాలతో ఎక్కువ ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ఆ శాఖ నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 774 రైతు భరోసా కేంద్రాల ద్వారా 97.173 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఆంధ్రప్రదేశ్ లో 664 మండలాల నుండి ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా.. 123 మండలాల్లో ధాన్యం సేకరణ మొదలుపెట్టింది ఆ శాఖ. కాగా..ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల నుంచి ముందుగా పంటని చెకరించింది ప్రభుత్వం. Andhra Pradesh paddy

ap paddy

నెల్లూరులో 262, పశ్చిమ గోదావరిలో 290, తూర్పుగోదావరిలో 161, కృష్ణాజిల్లాలో 59, శ్రీకాకుళం, కడపలో ఒక్కొక్కటి చొప్పున ఆర్‌బికెలు ధాన్యాన్ని సేకరించాయి. నెల్లూరులో అత్యధికంగా 52,734, పశ్చిమగోదావరిలో 31,817మెట్రిక్‌ టన్నులు, తూర్పుగోదావరిలో 8,978 మెట్రిక్‌ టన్నులు, కృష్ణాజిల్లాలో 3,642 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్నిసేకరించారు. అయితే గతంలో ధాన్యం కొనుగోళ్లలో అనేక ఆటంకాలు ఏర్పడేవి. వాటిని అధిగమించేందుకు సంబంధిత అధికారులు ప్రణాళికలు రచించారు. అందులో భాగంగా మిల్లర్ల నుండి ధాన్యాన్ని కొనుగోలు బాధ్యతలను తప్పించి రైతు భరోసా కేంద్రాలకు అప్పజెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో సాంకేతికను ఉపయోగించి బిల్లులు చెల్లింపు చేపట్టనున్నారు.

farmer

ఇక రైతులకి సకాలంలో చెల్లింపులు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. అయితే రైతులు తక్కువ రేటుకు తమ ధాన్యాన్ని దళారులకు అమ్ముకోవద్దని, ఆర్‌బికెల వద్ద మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్ముకోవాలని పౌరసరఫరాల సంస్ధ ఉన్నతాధికారులు కోరుతున్నారు. AP Paddy Procurement Speed UP

Leave Your Comments

మెంతి సాగుతో అధిక ఆదాయం…

Previous article

అరకు కాఫీపై ఆనంద్ మహేంద్ర పోస్ట్ వైరల్?

Next article

You may also like