CM YS Jagan Strict Measures Against Sale of Fake Seeds వ్యవసాయ రంగంలో గణనీయ మార్పులు అవసరమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి. కల్తీ విత్తనాలు, పురుగు మందులు, నకిలీ ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. వ్యవసాయం విషయంలో అడ్డ దార్లు తొక్కే అక్రమార్కులకు రెండేళ్ల జైలు శిక్ష విధించేలా చర్యలు ఉండాలని సీఎం జగన్ అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు అందించాలని అధికారులకు సూచించారు. ఇక అక్రమ వ్యవహారాల్లో ఉద్యోగుల హస్తం ఉంటె వెంటనే వారిని తొలగించాలన్నారు. దీనికోసం అవసరమైతే చట్టంలో మార్పులు తీసుకొస్తామని అన్నారు.
ఇకపోతే ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు దృష్టి పెట్టాలన్నారు. ఈ విషయంలో రైతులకు అవగహన కల్పించాలని అధికారుల్ని ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటలు వేయడం వల్ల రైతులు ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంది. బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగుఅయ్యేలా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. వరి పండిస్తే… వచ్చే ఆదాయం మిల్లెట్స్ పండిస్తే కూడా వచ్చేలా చూడాలి. దీనికోసం రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. మిల్లెట్స్ పంట వేస్తే మంచి ఆదాయం వచ్చేలా విధానాలు ప్రవేశపెట్టాలని సీఎం తెలిపారు. ఈ విషయంలో అధికారులు సరైన అధ్యయనం చేసి వారికి అండగా నిలవాలని వైస్ జగన్ స్పష్టం చేశారు. YS Jagan
ఇక మిల్లెట్స్ బోర్డు (Millet Board)ను వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకి సూచించారు సీఎం. మిల్లెట్స్‌ను అధికంగా సాగుచేస్తున్న ప్రాంతాల్లో ప్రాససింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. దీంతోపాటు సహజ పద్ధతుల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం ఇవ్వాలి. సేంద్రీయ, ప్రకృతిసేద్యంపై రైతుల్లో అవగాహన పెంచాలన్నారు. రసాయనాలు లేని పంటని పండించే దిశగా రైతులకు తోడుండాలని సీఎం చెప్పారు.ఆర్బీకే పరిధిలో ఏర్పాటుచేస్తున్న సీహెచ్‌సీలో కూడా ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమైన పరికరాలను ఉంచాలన్నారు. సేంద్రీయ వ్యవసాయినికి అవసరమైన పరికరాలు, మందులు, సేంద్రీయ ఎరువుల తయారీ పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలన్నారు వైస్ జగన్. కాగా.. ఖరీఫ్‌లో 1.12 కోట్ల ఎకరాల ఇ–క్రాప్ జరిగిందని చెప్పారు.45,35,102 మంది రైతులు ఇ– క్రాప్ చేయించుకున్నారని సీఎం జగన్ తెలిపారు. CM YS Jagan, Fake Seeds, Fake Fertilizers