Should we dump surplus rice in Bay of Bengal కొంతకాలంగా ధాన్యం కొనుగోలుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. యాసంగి వడ్లు కొనుగోలు చేసే విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదరకా .. వాదోపవాదాలు మిన్నంటుతున్నాయి. ధాన్యం కొనుగోలు చేసే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయగా… యాసంగి వడ్లు కొనాల్సిందేనని రాష్ట్ర నాయకత్వం కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ వస్తుంది. ఇక ఈ ఇష్యూ ప్రస్తుతం పార్లమెంటులో వాడివేడిగా నడుస్తుంది. సీఎం కెసిఆర్ సూచనల మేరకు తెరాస ఎంపీలు కేంద్రంతో యుద్ధనికి సిద్ధమయ్యారు. పార్లమెంటు సమావేశాల్లోనే తేల్చేయాలని నడుం బిగించారు. దీంతో సమావేశాలు ప్రారంభమైన నాటినుండి తెరాస ఎంపీలు నినాదాలతో మారుమ్రోగిస్తున్నారు. సభను ఏ మాత్రం ముందుకెళ్ళకుండా అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణపై ఎందుకు ఇంత వివక్ష అంటూ కేంద్రాన్ని నిలదీస్తున్నారు. కాగా.. తాజాగా తెలంగాణ ఎంపీలతో వివిధ రాష్ట్రాల నాయకులు గొంతు కలుపుతున్నాయి.
BJD Prasanna Acharya ఉప్పుడు బియ్యాన్ని కొనకపోతే మిగులు బియ్యాన్ని బంగాళాఖాతంలో పారబొయాలా అంటూ కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీజేడీ పక్ష నేత ప్రసన్నా ఆచార్య. కేంద్రం రెండు నాలుకల ధోరణితో మాట్లాడుతున్నది, ఉప్పుడు బియ్యాన్ని కొంటామని రెండు నెలల క్రితమే ప్రకటించింది. కానీ ఇప్పుడు కొనమని చెప్తున్నదని మండిపడ్డారాయన. రాజ్యసభ జీరో అవర్‌లో బియ్యం కొనుగోలు అంశాన్ని ప్రస్తావించిన ప్రసన్నా ఆచార్య.. ఉప్పుడు బియ్యం సేకరణ అనేది తెలంగాణా సృష్టిస్తున్న అంశంగా కేంద్రం వక్రీకరించడంపై మండిపడ్డారు. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రమే కాదని, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
Paddy Procurement ఒడిశా మరియు తెలంగాణ రాష్ట్రాల రైతులు ఏండ్ల తరబడి ఉప్పుడు బియ్యాన్ని ఉత్పత్తి చేస్తున్నట్టు ఆయన అన్నారు. ఈ ఏడాది ఒడిశాలో దాదాపు 28 లక్షల టన్నుల ఉప్పుడు బియ్యం మిగిలిందని చెప్పారు. ఒడిశా, తెలంగాణ నుంచి ఒక్క గింజ కూడా ఉప్పుడు బియ్యం తీసుకోవద్దంటూ ఇటీవల ఎఫ్‌సీఐ ద్వారా కేంద్రం జారీచేసిన ఉత్తర్వులను వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సమస్యల్లో ఉన్న రైతులకు ఇది మరో సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇది రైతులను తీవ్రంగా దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రధాని, ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రి జోక్యం చేసుకొని ఒడిశా, తెలంగాణతోపాటు ఉప్పుడు బియ్యం ఉత్పత్తి చేస్తున్న ఇతర రాష్ట్రాల రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్య పరిష్కారానికి చొరవచూపాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడుకు ప్రసన్నాచార్య విజ్ఞప్తిచేశారు.
కాగా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు యాసంగి వడ్లు కొనుగోలు చేసే కేంద్రాలు ఉండబోవంటూ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వానికి వడ్లు కొనుగోలు చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. నిల్వ కేంద్రాలు కేంద్రం పరిధిలో ఉంటాయని, ఒకవేళ రాష్ట్రం పంటని కొనుగోలు చేసినప్పటికీ ఏళ్ళ కాలంపాటు ధాన్యాన్ని నిల్వ ఉంచే అవకాశం లేదన్నారు. ఇకపోతే రైతులు వరిని కాకుండా ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకుని సేద్యం చేయాలని రైతులకు సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలపై ద్రుష్టి పెడితే అధిక ఆదాయం వస్తుందని సీఎం చెప్పారు. Salted Rice