pjtsau horticulture counselling 2021 ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం బిఎస్సీ (హానర్స్.) అగ్రికల్చర్, బి.ఎస్సీ (హానర్స్.) కమ్యూనిటీ సైన్స్., పీవీ. నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం బి.వి.ఎస్సీ., ఏ.హెచ్. మరియు బి.ఎఫ్.ఎస్సీ.. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర హార్టీకల్చరల్ విశ్వవిద్యాలయం బి.ఎస్సీ (హానర్స్.) హార్టీకల్చర్ కోర్సులకు సంబంధించి (బై.పి.సి. స్త్రీం) ప్రవేశాల సంయుక్త కౌన్సిలింగ్ మెడికల్ కౌన్సిలింగ్ తరువాత నిర్వహించ బడుతుంది.
తెలంగాణలోని వ్యవసాయ విశ్వవిద్యాలయమునకు ఆరు, వెటర్నరీ విశ్వవిద్యాలయ మునకు మూడు మరియు ఉద్యాన విశ్వవిద్యాలయమునకు రెండు కళాశాలలు మాత్రమే ఉన్నాయి. మూడు విశ్వవిద్యాలయములకు ఎటువంటి ప్రైవేటు మరియు అనుబంధ కళాశా లలు లేవు. ఈ మూడు విశ్వవిద్యాలయములలోని వివిధ సామాజిక వర్గాల బై.పి.సి ప్రీం కోర్సులలోని అన్ని సీట్లు కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేస్తారు. రెగ్యులర్ సీట్లు మరియు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల భర్తీ రిజర్వేషన్లకు లోబడి టీఎస్ ఎంసెట్-2021 మెరిట్ ప్రాతి పదికన జరుగుతుంది.
pjtsau 2021-22 ప్రవేశాల గురించి వాట్సప్ తదితర సామాజిక మాధ్యమముల ద్వారా జరు గుతున్న అసత్య ప్రచారమును మరియు వదంతులను విశ్వసించరాదని ధరఖాస్తుదారులకు మరియు వారి తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాము. వివిధ కోర్సుల ధరఖాస్తుదారుల మెరిట్ జాబితా మరియు సామాజిక వర్గాల వారీ సీట్ల కేటాయింపు వివరాలు కౌన్సెలింగ్కు ముందు గానే వెబ్ సైట్ లో ఉంచుతామని, ధరఖాస్తుదారుల నుండి అభ్యంతరాలను కూడా స్వీకరించి తరువాత తుది జాబితాను వెబ్ సైట్ www.pjtsau.edu.inలో పొందుపరచబడుతుంది.
వివిధ సామాజిక వర్గాల రిజర్వేషన్, నియమనింధనలను అనుసరించి సీట్ల భర్తీ జరుగు తుందని విశ్వవిద్యాలయ ఇన్చార్జ్ రిజిస్ట్రార్ డా:జగన్మోహన్ రావు తెలిపారు. ధరఖాస్తుదారుల మధ్యవర్తులను, కన్సల్టెంట్ లను మరియు ఏ ఇతర ఏజెన్సీలను విశ్వసించరాదు. అధికారిక సమాచారము కొరకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ ను మాత్రమే చూడాలి. వివిధ కోర్సులకు సంబంధించిన సమాచారము ఎప్పటికప్పుడు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో పొందుపరచడం జరుగుతుందని రిజిస్ట్రార్ తెలియజేశారు. horticulture