Telangana Law Student Case On Paddy Procurement వరి కొనుగోలుపై రైతుల్లో గందరగోళం నెలకొంది. లక్షల కోట్లు ఖర్చు చేసే ప్రభుత్వాలు ఒక రైతు పండించిన పంటను కొనకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆరుగాలం పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో మగ్గుతుంటే… కేంద్ర రాష్ట్ర నాయకులు మాత్రం చట్టసభల్లో ఎవరికి వారు విమర్శలు చేసుకుంటున్నారు. ఇదంతా రైతులకి పాలుపోవడమలేదు. కేంద్రం ప్రభుత్వం నసేమిరా అంటున్న వరి కొనుగోలు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మెడలు వంచి కొనుగోలు చేపిస్తామంటుంది. ఎవరి మాటలు నమ్మాలో తెలియక సగటు రైతు ఆందోళన చెందాల్సిన పరిస్థితి. ఇప్పటికే వరి కొనుగోలు ఇష్యూ కేంద్రం వద్ద ఉండగా..తాజాగా హైకోర్టు మెట్లెక్కింది. వివరాలలోకి వెళితే…
వరి ధాన్యాన్ని సేకరించేలా రాష్ట్రాన్ని ఆదేశించాలని హైకోర్టులో పిల్ దాఖలైంది. న్యాయ విద్యార్థి అయిన శ్రీకర్ కోర్టులో పిల్ దాఖలు చేశాడు. అటు కేంద్రం కొనక, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కొనక రైతన్నలు నష్టపోతున్నారని మరో న్యాయవాది పేర్కొన్నాడు. ఇటీవల వర్షాలు కురవడంతో కల్లాల్లో ఉన్న పంటకు మొలకలు వస్తున్నాయని, ఆరుగాలం పండించిన పంట నీటిపాలవుతుందని, అలాగే ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు గుండెపోటు బారిన పడుతున్నారు. ధాన్యం సేకరణకు ఎఫ్‌సీఐతో రాష్ట్రం ఒప్పందం చేసుకుందని హైకోర్టులో దాఖలైన పిల్‌లో పిటిషనర్ పేర్కొన్నారు. 40లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు ఒప్పందం చేసుకుందన్నారు పిటిషనర్. కాగా.. దీనిపై విచారణ డిసెంబరు 6కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. Paddy Procurement Issue