వార్తలు

ముగిసిన ఐదవ అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్ర కాంగ్రెస్ సదస్సు

0
Fifth International Agronomy Congress

Fifth International Agronomy Congress

Fifth International Agronomy Congress ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రానమి సంయుక్తంగా 5 రోజులుగా నిర్వహిస్తున్న 5వ అంతర్జాతీయ అగ్రానమి కాంగ్రెస్ నేడు ముగిసింది. ముగింపు సమావేశంలో నేషనల్ రెయిన్ ఫెడ్ ఏరియా అధారిటీ చీఫ్ ఎగ్జిక్యూ టివ్ ఆఫీసర్ అశోక్ దల్వాయి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వ్యవసాయరంగానికి సంబం ధించి ఢిల్లీ తరవాతి స్థానంలో ఉన్న హైదరాబాద్లో ఈ సదస్సు జరగడం చాలా అభినందనీయమని అన్నారు. వ్యవసాయం, రక్షణ తదితర పరిశోధన రంగాల్లో హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ హబ్ అని ఆయన అభివర్ణించారు.

Fifth International Agronomy Congress

వ్యవసాయరంగంలో భారతదేశం ప్రపంచంలో అద్వితీయశక్తిగా నిలబడిం దన్నారు. అయితే ఈ రంగంలో ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయని అశోక్ దల్వాయి అన్నారు. టెక్నాలజీలని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం పూర్తిస్థాయిలో జరగలేదన్నారు. కొత్త సవాళ్ళకి అనుగుణమైన కొత్త టెక్నాలజీలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలన్నారు. ప్రపంచంలో పౌష్టికాహార లోపంతో బాధపడే జనాభాలో 22 శాతం భారతదేశంలోనే ఉండటం గమనించాలని ఆయన సూచించారు. వ్యవసాయాన్ని సమగ్ర దృష్టితో చూడవలసిన సమయం ఆసన్నమైందని అన్నారు. ఆహార, పౌష్టికా హార భద్రతతోపాటు వ్యవసాయంవల్ల పర్యావరణానికి ఎదురవుతున్న సవాళ్లని పరిష్కరించడంలో దృష్టి పెట్టాలని సూచించారు. అదేవిధంగా రైతాంగ ఆదాయం అధికం అయ్యే విషయం గురించి ఆలోచించాలన్నారు. ముందు ముందు వ్యవసాయరంగంలో అనేక మార్పులు రానున్నాయన్నారు. అందుబాటులో ఉన్న పరిమిత భూవనరుల్లోనే వ్యవసాయాన్ని కొనసాగించవలసిన అవసరముం దన్నారు. అర్బన్ఫర్మింగ్, వర్టికల్ అగ్రికల్చర్ వంటి నూతన పద్దతులు రానున్నాయని అశోక్ దల్వాయి అన్నారు. 25-30 శాతం ఉన్న ఆహారవృధాని అరికట్టవలసి ఉందన్నారు. వ్యవసాయ రంగంలో డిజిటల్ టెక్నాలజీని విరివిగా వినియోగించాలని, ఆగ్రో ప్రాసెసింగ్ రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని అశోక్ దల్వాయి అభిప్రాయపడ్డారు.

Fifth International Agronomy Congress

గత పదేళ్లుగా ఉపకులపతి ప్రవీణ్ రావు నేతృత్వంలో యూనివర్సిటీ అన్ని రంగాల్లో ముందుకి వెళుతోందని ఐసిఏఆర్ డిడిజి(ఎటెన్షన్) ఏకె.సింగ్ అన్నారు. భూమికి ఇన్‌పుట్స్ ఇచ్చే విషయంలో సమతుల్యత ఉండాలని అభిప్రాయపడ్డారు. సమాజంతో సరైన కమ్యూనికేషన్ ఏర్పరచుకోవాలని, రైతాంగం పట్ల ప్రోయాక్టివ్ గా ఉండాలని ఏకె.సింగ్ సూచించారు. అనేకమంది సహకారంతోనే సుమారు 1300 ప్రతినిధులతో ఈ సదస్సుని విజయవంతంగా నిర్వహించగలిగామని ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణవు అన్నారు. కోవిడ్ మహమ్మారి ప్రభావం అనంతరం కాప్-26 సదస్సు తరువాత ఈ సదస్సే అంత పెద్ద ఎత్తున జరిగిందన్నారు. భూ వన రులు, జలవనరుల సమర్థ యాజమాన్యంతోనే మానవ మనుగడ కొనసాగుతుందని ప్రవీణ్ రావు అన్నారు. ఈ కార్యక్రమంలో డా:వి.కె.సింగ్, డా:రవీంద్రచారి, డా:చౌహన్, డా:యాకాద్రి తదితరులు పాల్గొన్నారు. పలుపురికి అవార్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. Eruvaaka

Leave Your Comments

పంట నష్టంపై పరిహారం అందిస్తాం…

Previous article

యాసంగి సాగుపై రేపు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

Next article

You may also like