Minister Kannababu ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. పది రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలకు ఏపీలో లక్షల ఎకరాల పంట నష్టం వాటిల్లింది. ఆస్థి నష్టం, ప్రాణ నష్టం భారీగా జరిగింది. జిల్లాలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో రాష్ట్ర యంత్రంగా కదిలింది. అధికారపార్టీ నాయకులు ఆయా ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ఉభయ గోదావరి జిల్లాలో పర్యటించారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన వెంటనే మంత్రి కన్నబాబు ఉభయ గోదావరి జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు.
తాడేపల్లిగూడెం, తణుకు, ఆచంట నియోజక వర్గాల్లో సహచర మంత్రి రంగనాధ రాజు ఇతర శాసన సభ్యులతో సహా పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంట నష్ట అంచనాలు పారదర్శకంగా చేసి త్వరలోనే నష్ట పరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ముందుగా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలంలో కొండెపాడు గ్రామంలో పొలాల్లోకి దిగిన మంత్రి కన్నబాబు అక్కడి బాధితులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ప్రతి రైతును ఆదుకుంటారని వారికీ భరోసా ఇచ్చారు. ఇక రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రివర్యులు చెరుకువాడ రంగనాథ రాజు, తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు, నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పర్యటించి అకాల వర్షాలు వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రైతులకు ఎక్కడా నష్టం జరగకుండా చూస్తామని దైర్యం చెప్పారు. Minister Kannababu