Meeting of Parliamentary panel కేంద్రం ప్రభుత్వం ఆర్డినెన్స్ పాస్ చేసిన మూడు సాగు చట్టాల ప్రకటన దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపింది. కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఢిల్లీ సరిహద్దుల్లో 40 రైతు సంఘాలతో దాదాపుగా ఏడాది పాటు ఆందోళన చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలు రైతుల్ని కూలీలుగా మార్చేలా ఉన్నాయంటూ రైతులు అభిప్రాయపడ్డారు. చట్టాలను రద్దు చేసేంతవరకు ఆందోళన విరమించేదే లేదని కేంద్రంపై అలుపెరగని పోరాటం చేశారు. కాగా గురునానక్ జయంతి సందర్భంగా జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు.
అయితే.. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించడంతో, రైతుల ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, కేసులను ఉపసంహరించుకోవాలని, అదేవిధంగా కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇదే అంశాలపై పార్లమెంటరీ ప్యానల్ సమావేశం జరిగింది. శుక్రవారం వ్యవసాయంపై పార్లమెంటరీ ప్యానెల్ సమావేశం జరిగింది. కాగా..ఈ సమావేషంలో సరిపడా సభ్యులు లేకపోవడంతో వ్యవసాయ శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం వాయిదా పడింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడంపై వివరించాల్సిన సమావేశానికి 29 మంది ఎంపీల్లో ఆరుగురు మాత్రమే హాజరయ్యారు. ఈ సమావేశానికి కమిటీ చైర్మన్ పర్వతగౌడతో పాటు ప్రతాప్ సింగ్ బజ్వా, బీబీ పాటేల్, అబూ తహర్ ఖాన్, కైలాష్ సైనీ, రాంనాథ్ ఠాకూర్ హాజరయ్యారు. Parliamentary panel Meeting