Mukhesh Ambani Buy Olive Trees నగరీకరణ అభివృద్ధి పేరుతో మొక్కల్ని విచక్షణారహితంగా నరికేస్తున్న రోజుల్లో కొందరు మాత్రం మొక్కల పెంపకంపై అమితాసక్తి చూపిస్తున్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మొక్కల్ని పెంచుతూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పట్టణాల్లో ఈ సంస్కృతి విపరీతంగా పెరిగింది. మిద్దె పైన, మేడ మీద తమకు నచ్చిన మొక్కల్ని పెంచుతూ సేద తీరుతున్నారు. మరికొందరు మొక్కల్ని పెంచుతూ ఆదాయం సమకూర్చుకుంటున్నారు. అయితే మనకి అందుబాటులో ఉండే మొక్కల ఖరీదు మహా అయితే రూ.50 నుండి రూ.1000 లోపే ఉంటుంది. కానీ ముఖేష్ అంబానీ పార్కులో ఒక్కో మొక్క ధర రూ. 25 లక్షలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా,,, ఇది నిజం.Olive Trees
ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ గుజరాత్లో అభివృద్ధి చేస్తున్న భారీ పార్కులో నాటేందుకు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి మొక్కలను తరలించారు. మార్గాని వీరబాబుకు చెందిన గౌతమీ నర్సరీ నుంచి రెండు ఆలివ్ మొక్కలను ప్రత్యేకంగా ముఖేష్ అంబానీ ఇంటికి తరలించారు. అయితే ఆ మొక్కలు స్పెయిన్ జాతికి సంబంధించినవిగా చెప్తున్నాడు వీరబాబు. స్పెయిన్ నుంచి తీసుకువచ్చిన వీటి వయస్సు సుమారు 180 సంవత్సరాలు ఉంటుందని చెప్తున్నాడు మార్గాని వీరబాబు. ఒక్కో మొక్క ధర రూ.25 లక్షలు ఉంటుందట. రెండేళ్ళ క్రితం ఇక్కడికి తెచ్చి, వాటిని అభివృద్ధి చేసినట్లు వీరబాబు వివరించారు. Mukhesh Ambani