వార్తలు

ఐదవ అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్ర కాంగ్రెస్ సదస్సు 3వ రోజు

0
Fifth International Agronomy Congress

Fifth International Agronomy Congress ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రానమి సంయుక్తంగా నిర్వహిస్తున్న 5వ అంతర్జాతీయ అగ్రానమి కాంగ్రెస్ మూడోరోజు రాజేంద్రనగర్‌లోని పిజెపీఎస్ఎయు ఆడిటోరియంలో కొనసాగింది. వ్యవసాయరంగ భవిష్యత్తు’ అన్న అంశంపై జరిగిన ప్లీనరీ సదస్సులో యుఎస్ఎ, కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాజ్ ఖోస్లా ఆన్లైన్లో ప్రసంగించారు. బిగ్ డేటా అన లిటిక్స్, ప్రెసిషన్ అగ్రికల్చర్, డిజిటల్ ఇంటెలిజెన్లు వ్యవసాయరంగంలో నేటి అవసరాలు అని ఆయన అన్నారు.ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంపొందించడానికి, చిన్న, సన్నకారు రైతుల ఆదాయం పెరగడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన డిజిటల్ టూల్స్ అత్యవసరం అని ఖోస్లా అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా, ముడ్రోజ్ యూనివర్సిటీ పూచరఫుడ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ డాక్టర్ సైమన్ కు తోపాటు మొరాకోకు చెందిన డాక్టర్ బ్రూనో గెరోడ్లు కూడా కీలకోపన్యాసాలు చేశారు. వాతావరణ మార్పులవల్ల సంభవించే పంటనష్టాలని అధిగమించ డానికి కన్జర్వేషన్ అగ్రికల్చర్ విధానాన్ని అనుసరించాలని వారు సూచించారు. పెట్టుబడి వ్యయం తగ్గించడానికి డిజిటల్ సాధనాలని విరివిగా ఉపయోగించాలని అన్నారు. గత కొన్నే ళ్లుగా భారతదేశంలో డిజిటలీకరణ ఊపందుకుంటున్నదని వారు అన్నారు. డిజిటలీకరణ మద్దతుతో కూడిన వ్యవసాయ పద్ధతులు అవలంబించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తిలో, రైతుల ఆదాయంలోనూ మంచి మార్పులు వస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Fifth International Agronomy Congress

 

Leave Your Comments

రైతులకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్…

Previous article

వరి కొనుగోలుపై మరోసారి ఢీల్లీకి…

Next article

You may also like