Minister Kannababu దేశంలో వరి పంటపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. వరి ధాన్యం ఇప్పటికే కేంద్రాల్లో నిలువు ఉన్నందున ధాన్యం కొనలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం వేయాలా వద్ద, వేస్తే ఎంత విస్తీర్ణంలో వేయాలి తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇక మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉన్న పంటలపై ద్రుష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని కోరుతున్నాయి. మరోవైపు తెలంగాణాలో వరి ధాన్యంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. వరి ధాన్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి , కేంద్ర ప్రభుత్వానికి అస్సలు సమన్వయం కుదరడం లేదు. కాగా తాజాగా ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి వరి పంటపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వివరాలలోకి వెళితే..
శాసనసభలో మంగళవారం వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు, బిందు సేద్యం, వ్యవసాయ యాంత్రీకరణ పథకాలకు రాయితీ అంశాలపై శాసన సభ్యులు అడిగిన ప్రశ్నలకు వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు సమాధానమిస్తూ… వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలవైపు ద్రుష్టి సారించాలని కోరారు. వరికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది. తక్కువ ఆదాయం వస్తుంది. వరి పంట కంటే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకుంటే రైతులకు మంచి గిట్టుబాటు అవుతుందని అభిప్రాయపడ్డారు మంత్రి కన్నబాబు. ఈ దిశగా రైతులకు శిక్షణ ఇస్తున్నాం. ఈ ఖరీలో రెండు లక్షల ఎకరాల్లో పంట మార్పిడి జరిగింది. రైతు వద్దకే విత్తనాలను సరఫరా చేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)లో 9వేలకు పైగా బ్యాంకింగ్ కరెస్పాండెంట్లను నియమిస్తున్నాం. ఆ బీకేలకు అనుసంధానంగా గోదాములను నిర్మిస్తున్నాం. వీటిల్లో రైతులు తమ పంటను అమ్ముకునే వరకు నిల్వ చేసుకోవచ్చు. ఆర్ బీకేలకు ఐఎజ్ సర్టిఫికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఈ-క్రాప్ అనే ది నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అన్నారు మంత్రి కన్నబాబు.
బిందు సేద్యం పరికరాల కోసం ఇప్పటికే కంపెనీలను ఆహ్వానించామని కానీ మొదటి టెండర్లో 40% ఎక్కువకు వేశారు కాగా రెండవసారి టెండర్లకు ఆహ్వానిస్తే కంపెనీలేవి రాలేదన్నారు. అయితే గతంలో బిందు సేద్యానికి రాయితీలు ఇవ్వలేదని గుర్తు చేసిన మంత్రి… కరోనా కారణంగా 2020-21లో ఎలాంటి రాయితీ ఇవ్వలేదు. 2021-22 సంవత్సరానికి సంబంధించి టెండర్లు పిలుస్తున్నాం. ఫిబ్రవరి నాటికి ప్రక్రియ పూర్తి చేసి, అడిగిన రైతులందరికీ పరికరాలు ఇస్తాం. దాదాపుగా 1,035 కోత యంత్రాలు ఇవ్వబోతున్నాం. ఈ ఒక్క ఏడాదిలోనే రూ.853 కోట్లు ఖర్చు చేయనున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు వ్యక్తిగత పరికరాలు, స్పేయర్లు, టార్పలిన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి కన్నబాబు అన్నారు. Eruvaaka