Karantaka Minister Prabhu Chauhan తెలంగాణా వెటర్నటీ డిపార్ట్మెంట్ లో అమలు చేస్తున్న సంక్షేమ పధకాలను పరిశీలించేందుకు వచ్చారు కర్ణాటక రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహన్. ఈ మేరకు తెలంగాణ పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్న ప్రభు చౌహన్, తమ రాష్ట్రంలో కూడా ఇదే పథకాలను అమలు చేస్తానని అన్నారు. పశువుల కోసం అత్యవసర అంబులెన్స్ లు అందుబాటులో ఉంచడం చాలా సంతోషంగా ఉందన్నారు ప్రభు చౌహన్. తమ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను మంత్రి తలసానితో చర్చించారు.
మంత్రి తలసాని మాట్లాడుతూ..రాష్ట్రాలు పరస్పరంగా పథకాల అమలును తెలుసుకోవడంతో ఇరు రాష్ట్రాల రైతులకు లబ్ధి చేకూరుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు..దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలవుతున్నాయన్నారు. 92 కోట్ల చేప పిల్లలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, ప్రతి సంవత్సరం యాదవులు, కురుమలకు సబ్సిడీ గొర్రెలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. గొర్రెలకు ఉచిత వైద్యంతో పాటు ఇన్సూరెన్స్ కూడా చేయిస్తున్నామని, ఏడేండ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు.