-
కల్లాల్లో రైతు కన్నీరు పెడుతుంటే – ఢిల్లీలో కేసీఆర్ సేద తీరుతున్నాడు
-
ఢిల్లీ పర్యటన రెండు పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలో భాగం
-
ఈ తీర్థయాత్రలతో అయ్యేది లేదు పొయ్యేదీ లేదు
-
వానాకాలం పంట కొనకుండా యాసంగి పంటపై పంచాయితీ ఏంటీ
-
రెండు పార్టీల రాజకీయ చదరంగంలో రైతే పావు
Revanth Reddy తెలంగాణ సమాజానికి పీసీసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. యాసంగి వరి కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల్ని దారుణంగా మోసం చేస్తున్నాయి అని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ఢిల్లీ పర్యటన కేవలం తెరాస, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలో భాగమేనంటూ మండిపడ్డారు. ఆరుగాలం కష్టించి పండించిన పంట కొనుగోలు విషయంలో ప్రభుత్వాలు ధర్నాల పేరుతో డ్రామాలు ఆడుతున్నాయని ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలకు పాపం రైతులు బలైపోతున్నారని అన్నారు. బాధ్యత నిర్వర్తించాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాజకీయ చదరంగంలో రైతును పావుగా చేసుకుని పరిహాసమాడుతున్నాయి.
Paddy Procurement వానాకాలం పంటని పక్కనపెట్టి యాసంగి పంట కొనుగోలుపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ముందడుగేస్తుందని ప్రశ్నించిన రేవంత్.. వానాకాలం పంటకు యాసంగి పంటతో ముడిపెట్టి రాష్ట్ర ప్రభుత్వం రైతుల గొంతు కొస్తుందని అభిప్రాయపడ్డారు. సీఎం కెసిఆర్ ఇందిరా పార్క్ వద్ద రెండు గంటలు ఏసీ టెంటులో కూర్చుని సమస్య పరిష్కరిస్తానంటే ఇది ప్రగల్బాలు పలికినట్టు కాదా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో రాజకీయాలు చేయడం కారణంగా పంట వర్షంలో తడిచి మొలకెత్తింది. ఇప్పుడు ధాన్యం నాశనం అయింది. ఆ పంటకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. CM KCR
అంతే కాదు… నల్ల చట్టాల రద్దు తమ నాయకుడు ఘనతే అని మంత్రులు కూడా సిగ్గుఎగ్గు లేకుండా ప్రకటనలు చేస్తున్నారు. కేసీఆర్ ఏసీ టెంటులో రెండు గంటల ధర్నాతోనే మోదీ దిగొచ్చి నల్ల వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని ప్రచారం చేసుకోవడం వారి అజ్ఞానానికి నిదర్శనం. ఇది నిజంగా ఉద్యమం చేసిన రైతులను అవమానించడమే అవుతుంది. నల్ల చట్టాలను రద్దు చేయించే శక్తే కేసీఆర్ కు ఉంటే అదే శక్తిని ఉపయోగించి ధాన్యం కొనేలా మోదీని ఒప్పించ వచ్చు కదా అని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగం ఈ రెండు ప్రభుత్వాలపై విశ్వాసాన్ని కోల్పోయింది. ఈ మాటలు నేను అన్యపదేశం గా చెప్పడం లేదు. క్షేత్రంలో రైతులతో నేరుగా మాట్లాడి వాళ్ల మనోభావాలు గ్రహించి చెబుతున్నాను. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల బాధలు నేరుగా తెలుసుకునేందుకు “కల్లాల్లోకి కాంగ్రెస్” పేరుతో కాంగ్రెస్ నాయకత్వం క్షేత్రానికి వెళ్లింది అని చెప్పారు రేవంత్. TRS BJP Match Fixing
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చీకటి ఒప్పందంతో డ్రామాలు ఆడుతుంటే రైతుల ధాన్యం మాత్రం కొనుగోలు కేంద్రాల్లో పడి ఉంది. ఐకేపీ కేంద్రాలకు ధాన్యం తెచ్చి 20 -30 రోజులు గడుస్తున్నా కొనేనాథుడు లేడని బోరున విలిపిస్తున్నారు. కొందరు రైతుల పంట కొనుగోలు పూర్తైనా ఇంత వరకు వాళ్ల ఖాతాలకు డబ్బులు వేయలేదు. వర్షంలో తడిసి, మొలకెత్తిన ధాన్యం చూపించి కన్నీరుమున్నీరవుతున్నారు. అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నాడు. Revanth Comments On Paddy Procurement