Fifth International Agronomy Congress ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రాసమి సంయుక్తంగా నిర్వహిస్తున్న 5వ అంతర్జాతీయ అగ్రానమి కాంగ్రెస్ రెండోరోజు రాజేంద్రనగర్‌లోని పిఇటిఎస్పీయు ఆడిటోరియంలో కొనసాగింది. దీనిలో భాగంగా వివిధ అంశాలపై సెషన్స్ జరిగాయి. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఏకె.సింగ్ నేతృత్వంలో ఒక సెషన్ జరిగింది. శాస్త్రవేత్తలు సహజవనరుల యాజు మాన్యంపై దృష్టి పెట్టవలసిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. జాతి భవిష్యత్తు ఆహార పోషకాహారభద్రతలో వీరి పాత్ర మరింత కీలకం కానుందన్నారు. వాతావరణ, సాంఘిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొవడానికి అవసరమైన జీవవైవిధ్యం మనకి ఉందని ఈ సదస్సులో అభిప్రాయపడ్డారు. కరవు, వాతావరణ మార్పులు వంటి వాటిని ఎదుర్కొవడానికి అనువైన జన్యుపరమైన వైవిధ్యం కనుగొనడం, దాని సరైన యాజమాన్యంపై దృష్టి సారించాలని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
ఐసీఏఆర్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో బెసెస్ మేనేజ్మెంట్ కి చెందిన ఏకె.ఘోష్ అధ్యక్షతన మరో సెషన్ జరిగింది. ఆర్టిఫి పియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ ర్నింగ్, బడేటా రోబోటిక్స్ వంటి అధునాతన టెక్నాలజీలని వ్యవసాయంలో విరివిగా వినియోగించాలని ఈ సెషన్ అభిప్రాయపడింది. సుస్థిర వ్యవసాయం కోసం డిజిటల్ అగ్రికల్చర్, వాల్యూట్రైన్ విధానం, రైతాంగాన్ని మార్కెట్ అనుసంధానించడం, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేయడం వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని శాస్త్రవేత్తలు సూచించారు.