Union Cabinet approves proposal to repeal three farm laws సాగు చట్టాల రద్దుకు కేంద్ర ప్రభుత్వం మరో ముందుడుగేసింది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా నోటి మాట సరిపోదని, వచ్చే పార్లమెంటులో చట్టాన్ని రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అదేవిధంగా కనీస మద్దతు ధరతో పాటు మరికొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. మా డిమాండ్లు నిరవేర్చిన తర్వాతనే పోరాటం విరమిస్తామని రైతులు స్పష్టం చేశారు. అయితే ఈ నెల 29 నుంచి శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ అయింది. అందులో భాగంగా వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు-2021 కు ఈ సమావేశంలో కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మొత్తానికి మూడు వ్యవసాయ చట్టాల బిల్లు పార్లమెంట్ సమావేశాల్లో రద్దు కానుంది.
Three Farm Laws కాగా.. గత ఏడాది రైతు ప్రజానాల రీత్యా మూడు వ్యవసాయ చట్టాలకు ఆర్డినెన్స్ పాస్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ చట్టాల వల్ల రైతులు ఎవరి దగ్గర తలవంచుకునే పరిస్థితి ఉండదని కేంద్రం పేర్కొంది. కానీ ఆ చట్టాలని రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. మూడు సాగు చట్టాలు రైతులకి వ్యతిరేకంగా ఉన్నాయంటూ పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిచ్చారు. దాదాపుగా 40 రైతు సంఘాలతో ఏడాది పాటు అలుపెరగని ఉద్యమానికి తెర తీశారు. ఈ ఉద్యమంలో 750 మంది రైతులు మృత్యువాత పడ్డారు. ఎంతో మంది రైతులు గాయపడ్డారు. మొత్తానికి రైతుల నిరనసలకి కేంద్రం దిగొచ్చింది. మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. కాగా ఈ చట్టం ప్రస్తుతం పార్లమెంట్లో రద్దు కానుంది. Union Cabinet