వార్తలు

ఉచిత రేషన్ పథకం పొడిగింపు…

0
Govt decides to extend free ration scheme

free ration scheme

Govt decides to extend free ration scheme సామాన్యులకి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కరోనా సమయంలో పనులు లేక సామాన్యులు ఎంతో ఇబ్బంది పడ్డారు. తినడానికి తిండి లేని గడ్డు పరిస్థితుల్ని కూడా ఎదుర్కొన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన బృహత్తర పథకమే గరీబ్ కళ్యాణ్ అన్నా యోజన పథకం. రేషన్ కార్డు ఉన్న పేదలకు ఉచిత రేషన్ అందించడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. కాగా తొలిగా ఈ స్కీమ్‌ను 2020 ఏప్రిల్ నుంచి జూన్ వరకు అమలు చేశారు. తర్వాత దీన్ని 2021 నవంబర్ 30 వరకు పొడిగించారు. ఇప్పుడు మరోసారి స్కీమ్ గడువు ఎక్స్‌టెండ్ చేశారు.

anurag thakur

Free Ration Scheme ఈ పథకంలో భాగంగా ప్రతి నెల 5 కిలోల బియ్యం, కిలో గోధుమలను ఉచితంగా అందిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ సమయంలోనూ ఈ పథకాన్ని కేంద్రం అమలు చేసింది. అయితే ఈ స్కీమ్ ని వచ్చే ఏడాది మార్చ్ వరకు పెంచనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తాజాగా ఈ విషయాన్ని వెల్లడించారు. కాగా ఈ స్కీమ్ కింద దాదాపుగా 80 కోట్ల కుటుంబాలకు లభ్ది చేకూరనుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రేషన్‌కు ఈ బియ్యం అదనం.

modi

అయితే ఇటీవల ఈ కార్యక్రమాన్ని పొడిగించే ఉద్దేశం తమకు లేదని కేంద్ర ఆహార కార్యదర్శి సుదర్శన్ పాండే వెల్లడించారు. దీంతో ఈ పథకాన్ని కేంద్రం నిలిపివేస్తుందని ప్రచారం జరిగింది. కానీ నేడు ఈ స్కీమ్ పై తుది నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులకు ఊరట అనే చెప్పాలి.

Leave Your Comments

డీజే దెబ్బకు 63 కోళ్లు మృతి !

Previous article

సాగు చట్టాల రద్దుపై కేంద్ర క్యాబినెట్ ఆమోదం…

Next article

You may also like