fifth international agronomy congress. పోషకాహారం అందుబాటులో సవాళ్లు ఎదుర్కొనే మార్గాలపై ఐదవ అంతర్జాతీయ అగ్రానమి కాంగ్రెస్ హైదరాబాద్, రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం క్యాంపస్లో ఈ నెల 23-27 తేదీల మధ్య జరగనుంది. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రానమి, పికెటిఎన్జీయులు సంయుక్తంగా దీనిని నిర్వహించనున్నాయి. ఈ సమావేశ వివరాలను సైఫాబాద్ కమ్యూనిటీ సైన్స్ కళాశాలలో పికెటిఎన్జీయు ఉపకులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావు వెల్లడించారు. ఈ అంతర్జాతీయ సదస్సులో సుమారు 1300 మంది జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు పాల్గొననున్నారని వివరించారు. 500 మంది ఆన్లైన్, 800 ఆన్లైన్లో పాల్గొననున్నారని ప్రవీణ్ రావు తెలిపారు. అశోక్ దల్వాయి, త్రిలోచనమ హాపాత్ర, పంజాబ్ సింగ్ వంటి అనేక మంది నిష్ణాతులు పాల్గొంటారని వివరించారు.
fifth international agronomy congressవాతావరణ మార్పుని తట్టుకునే వంగడాల రూపకల్పన, సమీకృత వ్యవసాయ పద్ధతులు, స్మార్ట్ మెకనైజేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, బిగ్ డేటా, ప్రెసిషన్ ఫార్మింగ్, నూతన జాతీయ విద్యావిధానం నేపధ్యంలో వ్యవసాయ విద్య వంటి 13 ప్రధాన అంశాల గురించి దీనిలో నిశితంగా చర్చించనున్నట్లు ప్రవీణ్ రావు తెలిపారు. ఈ సదస్సులో సుమారు వేయిమంది విద్యార్థులు పోస్టర్ ప్రజంట్ చేస్తారన్నారు. ఆవిష్కరణలకి గుర్తింపుగా బంగారు పతకాలు, జీవితసాఫల్య పురస్కారాలు అందచేయనున్నట్లు ప్రవీణ్ రావు తెలిపారు. పంటల మార్పిడి అన్న అంశం రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమని తెలిపారు.
పిజేటీఎస్ఎయు అభివృద్ధి చేసిన వంగడాలని దేశంలో 7,8 రాష్ట్రాల్లో ఆదరణ పొందుతున్నాయన్నారు. విశ్వవిద్యాలయంలో 70 శాతం పైగా పూర్తిస్థాయిలో శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారన్నారు. మరో 200 మందిని నియమించడానికి ప్రభుత్వ అనుమతి కోరామని దీనితో 98 శాతం సిబ్బంది ఉన్నట్లవుతుందని తెలిపారు. ప్రజలకి అవసరమైన నాణ్యమైన, పోషకాహార ఆహారభద్రత కల్పించడం అందరి బాద్యత అని వివరించారు. ఇటువంటి సదస్సుల ద్వారా ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆవిష్కరణల గురించి సమగ్రంగా చర్చించి రైతు లందరికీ మేలు జరిగేలా వారి ఆదాయం రెట్టింపు అయ్యేలా చేయడమే చూస్తామని ప్రవీణ్ రావు వివరించారు. ఈ మీడియా సమావేశంలో పిజేటీఎస్ఎయు పరిశోధన సంచాలకులు డాక్టర్ జగదీశ్వర్, ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రానమి కార్యదర్శి డాక్టర్ వి.కె.సింగ్ పాల్గొన్నారు. fifth international agronomy congress Seminar