వివాదాస్పద రైతు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. గతేడాది మూడు సాగు చట్టాలను కేంద్రం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఆగ్రహించిన రైతులు ఏడాది పాటుగా నిరసనలు, ధర్నాలతో ఆందోళన కొనసాగిస్తున్నారు. భార్య బిడ్డలను వదిలి రోడ్లపైకి వచ్చి గళం విప్పారు. ఈ నిరసనలో భాగంగా ఎంతో మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. కొందరి రైతులపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక ఈ ఇష్యూ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడంతో ప్రధాని మోడీ తనను తాను సమర్ధించుకుంటూ కల్లబొల్లి మాటలతో కాలయాపన చేశారు. అయితే రైతుల నిరసనలు మాత్రం ఏ మాత్రం తగ్గకపోవడంతో ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది. అమల్లోకి తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన వెలువడింది.
( Farm Laws Repeal LIVE Updates )మూడు సాగు చట్టాలను రద్దు చేయడంతో రైతుల్లో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నరు. అటు పలు సంఘాలు తమ వాదన వినిపిస్తున్నాయి. ఎట్టకేలకు రైతులు గెలిచారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ సాగు చట్టాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం జరుగుతుందో నిపుణులు చెప్తున్నా మాట ఇది. ఈ చట్టాల వల్ల రైతులకు జరిగే మేలు ఏమాత్రం ఉండదు. కార్పొరేట్ సంస్థలకే ఇవి మేలు చేస్తాయంటున్నారు. దేశంలో వ్యవసాయ ఉత్పత్తిని ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఈ చట్టం అవకాశం ఇస్తున్నా.. ఎంత మంది రైతులు ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి విక్రయించగలరనేది ప్రశ్నగా మారిందని చెప్తున్నారు. కేవలం కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలు.. వాటి ఏజెంట్లు రైతుల నుంచి కొనుగోలు చేసి ఆ తరువాత రాష్ట్రాలు దాటిస్తూ వ్యాపారం చేసుకుంటాయని చెబుతున్నారు.( Farm Laws Repeal )
Also Read : వ్యవసాయ చట్టాలు రద్దు… కానీ… !