తెలంగాణలో యాసంగి వరి పంట కొనుగోలు అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. యాసంగి పంటని కొనుగోలు చేయాల్సిందిగా అధికారపార్టీ తెరాస (trs) మహా ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొనడం గమనార్హం. అనంతరం తెరాస మంత్రులు గవర్నర్ తమిళిసైని (governor Tamilisai) కలిసి వినతిపత్రం అందించారు. కాగా ఈ ఇష్యూ ప్రస్తుతం కేంద్రం టేబుల్ వద్దకు చేరింది. యాసంగి వరి కొనుగోలుపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది.
(paddy procurement) ఇప్పుడున్న పరిస్థితుల్లో ధాన్యం కొనలేమని చేతులెత్తేసింది కేంద్రం. ఇప్పటికే దేశంలో బియ్యం, గోధుమలు నిల్వలు ఉన్నట్లు, ఈ పరిస్థితుల్లో బియ్యం కొనుగోలు చేయలేమంటూ కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులు ప్రత్యామ్నాయ పంటలపై ద్రుష్టి సారించాలని కేంద్రం పేర్కొంది. గత నిర్ణయాల మేరకు ఇప్పటి వరకు బాయిల్డ్ రైస్ సేకరించామని, ఇకపై కొనమని కేంద్రం స్పష్టం చేసింది. దేశీయ అవసరాలు, ఎగుమతుల మేరకు నిర్ణయం ఉంటుందని తెలిపింది. గతంలో తెలంగాణ నుంచి 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు, 40లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించాలని నిర్ణయించినట్లు పేర్కొంది.
అయితే వరి పంట కొనుగోలు అంశం పక్కనపెడితే ఈ విషయంలో రైతులు గందరగోళంలో ఉన్నారు. ఓ వైపు అధికార పక్షం కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనిపిస్తామని హామీ ఇవ్వగా..అటు కేంద్రం మాత్రం తన వైఖరిని స్పష్టంగా వినిపిస్తుంది. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో వర్షపాతం నమోదైంది, మరోవైపు కొనుగోలు చేస్తారా చెయ్యరా అన్న ఆందోళన మొదలైంది రైతుల్లో. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సానుకూల సమాచారం ఇస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : రైతులకి మోడీ గుడ్ న్యూస్…?
Also Read : సాగు చట్టాలపై నిర్ణయం…రద్దు వెనుక ఏం జరిగింది ?