వార్తలు

కౌలు రైతును ఆదుకునేవారే లేరా !

0
tenant farmers facing problems
tenant farmers facing problems

దేశంలో కౌలు రైతుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. భూమినే నమ్ముకున్న కౌలు రైతులకు ప్రోత్సహం కరువైంది. కష్టించిన పంటకు మద్దతు దొరక్కపోవడం దురదృష్టకరం,. అదేకాకుండా ధాన్యం విక్రయాల్లోనూ వారికి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. దీంతో వారి పరిస్థితి దిక్కుతోచని విధంగా మారింది. ఇక మన ప్రభుత్వాలు కూడా వారిని గాలికి వదిలేసిన పరిస్థితి. అయితే ప్రభుత్వాల నుంచి ప్రోత్సహం లభిస్తున్నప్పటికీ అది కేవలం పట్టాదారులకు మాత్రమే చెందుతుంది. అందులో భాగంగా రైతుబంధు, పీఎం కిసాన్‌ పథకాలు పట్టాదారులకే వరంగా మారాయి. మరీ ముఖ్యంగా కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వని పరిస్థితి.

ప్రస్తుతం వారు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటంటే.. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు డబ్బులను సైతం భూమి యజమాని ఖాతాలోకే వేయాలని సర్కారు వారు నిర్ణయించారు. ఈ నిర్ణయం నిజంగా కౌలు రైతులకు భారంగా మారింది. ఇందుకోసం రైతులు కౌలుకు తీసుకున్న భూమి యజమానుల ఆధార్, బ్యాంకు ఖాతా నంబర్లు కావాలనడం, ధాన్యం డబ్బులను ఆ ఖాతాల్లోనే జమ చేస్తుండటంతో కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేగాకుండా.. సదరు భూయజమానికి చెందిన పాస్‌బుక్‌లో ఎంత మేర భూమి ఉందో.. దానికి తగినంత మాత్రమే ధాన్యం కొంటామని చెప్తుండటంతో దిగాలు పడుతున్నారు. తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు ఈ కొత్త నిబంధనలు ఏమిటని మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలు భారం తగ్గించుకునేందుకే కొత్త రూల్స్‌ పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. అయితే.. అయితే ప్రభుత్వం మాత్రం ఇదే విషయాన్నీ వేరే విధంగా చెప్తుంది. పంట కొనుగోళ్లలో అక్రమాలను అడ్డుకునేందుకే ఈ కొత్త విధానం అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం చెప్తోంది.

నిజానికి ప్రస్తుతం కౌలు రైతులే ఎక్కువగా ఉన్న పరిస్థితి. కానీ నేడు వారే సమస్యలతో బోరుమంటున్నారు. సర్కారు నుండి వచ్చే ప్రతి పథకం పట్టాదారులకే చెందుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. దీనికి వెంటనే పరిష్కారం కావాలని వారు కోరుతున్నారు. ఇక వందల ఎకరాలు ఉన్న కొందరికి ప్రభుత్వ పథకాలు అందుతుండటం, కష్టించి పండిస్తున్న కౌలు రైతులకి అన్యాయం జరుగుతుండటంపై పలు సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. రైతులను రాజుగా చూడాలంటున్న ఈ ప్రభుత్వాలు అసలు రైతులని పక్కనపెట్టి భూస్వాములకు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తున్నాయి. ఈ విధానం వెంటనే మారకపోతే కౌలు రైతులు కూడా వేరే మార్గం చూసుకునే పరిస్థితి వస్తుందని నిపుణులు చెప్తున్నారు.

#tenantfarmers #agriculturelatestnews #eruvaaka #farmers #tenantissues

 

 

Leave Your Comments

విద్యాసాగర్‌రావుకు నివాళులర్పించిన మంత్రి…

Previous article

కాప్సికం పంట సాగు చేసే పద్ధతులు…

Next article

You may also like