వార్తలు

విద్యాసాగర్‌రావుకు నివాళులర్పించిన మంత్రి…

0
Minister Niranjan Reddy Pays Tributes to Vidyasagar Rao
Minister Niranjan Reddy Pays Tributes to Vidyasagar Rao

నీటిపారుదల రంగ నిపుణుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు జయంతిని పురస్కరించుకుని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్ లో 5వ తెలంగాణ ఇరిగేషన్ డే వేడుకలు జరిగిగాయి. ఈ వేడుకల్లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి. ప్రకాష్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ రావు పాండే తదితరులు పాల్గొన్నారు. విద్యాసాగర్ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన మంత్రి నిరంజన్ రెడ్డి సాగునీటి రంగంలో ఉత్తమ సేవలు అందించిన ఇంజినీర్లకు అవార్డులు అందజేశారు. అవార్డులు అందుకున్న వారిలో జగిత్యాల చీఫ్‌ ఇంజినీర్‌ సుధాకర్‌రెడ్డి, ఇంటర్‌స్టేట్‌ వాటర్‌ రిసోర్స్‌ విభాగం సీఈ కోటేశ్వర్‌రావు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం డీఈఈ నీలిమ లు ఉన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… నీటిపారుదల రంగ నిపుణుడు, ప్రభుత్వ మాజీ సలహాదారు ఆర్.విద్యాసాగర్‌రావు జయంతి ఇరిగేషన్ డే గా జరుపుకోవడం సంతోషకరంగా ఉందన్న ఆయన విద్యాసాగర్‌రావు గారు వయసుతో సంబంధం లేకుండా అందరీతో స్నేహపూర్వకంగా ఉండేవారన్నారు. సాహిత్య అభిలాష, ప్రవేశం ఉన్న వ్యక్తి విద్యాసాగర్ రావు. ఒక్కో ప్రభుత్వంలో ఒక్కో శాఖ ప్రాముఖ్యత సంతరించుకుంటదని.. పోయిన ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ.. ఇప్పుడు వ్యవసాయ శాఖకు ఆ ప్రాముఖ్యత ఉందని స్పష్టం చేశారు.

ప్రజల కోణంలో ఆలోచించి తపన పడితే వచ్చే ఆవిష్కరణలు అద్బుతాలుగా నిలుస్తాయి.. దానికి సీఎం కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉదాహరణ అని మంత్రి తెలిపారు. మానవ సమాజంలో అవసరం, అనివార్యతబట్టి ఆవిష్కరణలు వస్తాయని, తెలంగాణలో చుక్కచుక్క నీటిని ఒడిసిపట్టిన ఘనత సోషల్ ఇంజినీర్, పొలిటికల్ ఇంజినీర్, ఫీల్డ్ ఇంజినీర్ సీఎం కేసీఆర్ వల్లే సాధ్యం అయిందని అన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి.

#MinisterNiranjanReddy #VidyasagarRao #BestEngineersAwards #TelanganaIrigation #AgricultureLatestNews #Eruvaaka

Leave Your Comments

రైతు పారిశ్రామికవేత్త కుసుమ ఎందరికో ఆదర్శం…

Previous article

కౌలు రైతును ఆదుకునేవారే లేరా !

Next article

You may also like