పంట కొనుగోలు అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కిరికిరి నడుస్తుంది. ఈ మేరకు ఇరు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కెసిఆర్ వరి కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వాలని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఏడేళ్ల కాలం నుంచి అన్నదాతల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణలో 3 కోట్ల టన్నుల ధాన్యం కొనుగోలుపై కేంద్రం వడ్లు కొనాలని వచ్చే శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు చేపడుతాం అని తేల్చి చెప్పారు సీఎం. ఈ మేరకు లక్షలాది మంది రైతులతో కలిసి ధర్నాలు చేయబోతున్నామని స్పష్టం చేశారు. వడ్లు కొనేవరకు ఊరుకునేది లేదన్నారు. ఆ రోజు జరిగే ధర్నాలో బీజేపీ కూడా వచ్చి కూర్చుంటుందా అని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాల కోసం కొట్లాడుతాం. మా ప్రాణం పోయే వరకు తెలంగాణ కోసం, రైతుల ప్రయోజనాల కోసం కొట్లాడుతాం. మీ తాత జేజమ్మ ఎవరున్నా వదిలిపెట్టం అంటూ సీఎం కెసిఆర్ మండిపడ్డారు.
#TRS #KCR #BJP #Agriculture #Eruvaaka