వార్తలు

కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శోభ కరంద్లాజే గారికి వినతిపత్రం అందజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

0

రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శోభ కరంద్లాజే (shobha karandlaje)గారికి రాష్ట్రానికి నిధుల కేటాయింపు పెంచాలని వినతిపత్రం అందజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy)గారు..

తెలంగాణకు కేంద్రం నిధులు పదిరెట్లు పెంచాలి. తెలంగాణ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు కేంద్రం నుండి వివిధ పథకాల ద్వారా అందుతున్న నిధులు సగటున  ఏడాదికి రూ.800 కోట్లు మాత్రమే రైతుబంధు, రైతుభీమా వంటి వినూత్న పథకాల ద్వారానే ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం రూ.50 వేల కోట్లు రైతుల భద్రత, వ్యవసాయ పెట్టుబడుల కోసం ఖర్చు చేయడం జరిగింది.

దేశంలోని భూవిస్తీర్ణంలో తెలంగాణ వాటా 3.4 శాతం మాత్రమే అయినప్పటికీ దేశంలోని మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ వాటా 4.65 శాతంగా ఉన్నది. అలాగే జాతీయస్థాయిలో వివిధ ధాన్యాల  ఉత్పత్తిలో తెలంగాణ వాటా 9.9 శాతం ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే సాగునీటి ప్రాధాన్యతను గుర్తించి, రాష్ట్రం ఏర్పడిన వెంటనే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి, నూతన ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి సాగునీటిని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతున్నది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే సాగునీటి రంగం మీద పెట్టిన పెట్టుబడులు ఫలితాలనిస్తున్నాయి.

రాష్ట్రమంతటా భూగర్భజలాలు పెరగడంతో పాటు రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు నిండుగా ఉన్నాయి. దేశంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటును సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయం మీద రైతులకు భరోసా కల్పించేలా రైతుల ఆదాయం పెంచడానికి సమయానికి విత్తనాలు, ఎరువులు అందిస్తూ, ధాన్యం కొనుగోలు చేయడమే కాకుండా ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ను ఏర్పాటు చేసి రైతు వేదికలు నిర్మించి వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడం జరిగింది.

తెలంగాణ వ్యవసాయ అనుకూల విధానాలతో వ్యవసాయరంగంలో సాధించిన విజయాలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తూ ప్రస్తుతం అందిస్తున్న దానికి పదిరెట్లు ఎక్కువ నిధులను కేటాయించాలన్నారు.

రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి శోభ కరంద్లాజే ((shobha karandlaje)గారికి రాష్ట్రానికి నిధుల కేటాయింపు పెంచాలని వినతిపత్రం అందజేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు (Singireddy Niranjan Reddy) , పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి శోమిత బిశ్వాస్ (shomita biswas) గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు (Raghunandan Rao)గారు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు కొండిబ (Hanumant Kondiba ) గారు పాల్గొన్నారు.

Leave Your Comments

అరటిలో ఎరువుల యాజమాన్యం

Previous article

వీనస్ ఫ్లై ట్రాప్‌ను ఎలా పెంచుకోవాలి ?

Next article

You may also like