వార్తలు

ఈ ఏడాది ముందే పలకరించనున్న నైరుతి పవనాలు..

0

ఈ సారి నైరుతి రుతుపవనాలు ముందే పలకరిస్తున్నాయి. గత వారమే దక్షిణ అండమాన్ సముద్రంలో పూర్తిగా, దక్షిణ బంగాళాఖాతం, ఉత్తర అండమాన్ సముద్రంలా పలు ప్రాంతాల్లో ప్రవేశించిన రుతుపవనాలు.. ఒకరోజు ముందే కేరళ తీరాన్ని తాకనున్నాయి. సాధారణంగా మే 22 న రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రంలోకి వస్తాయి. ఈ ఏడాది ఒకరోజు ముందుగానే రావడంతో కేరళకు కూడా ఒకరోజు ముందే చేరుకుంటున్నాయి. రుతుపవనాల ఆగమనానికి అనుకూల వాతావరణం ఏర్పడడం మంచి పరిణామంగా చెప్పుకోవాలి. ఒకరోజు ముందే నైరుతి రుతుపవనాల రాకతో అండమాన్ నికోబార్ దీవుల్లో గత వారమే వర్షాలు ప్రారంభమవగా ఈ ఏడాది వర్షపాతం సాధారణంగా ఉంటుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
బంగాళాఖాతంలో పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు మరింత చురుకుగా ముందుకు వస్తుండగా ఈనెల 31న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. రుతుపవనాల రాకతో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు.

Leave Your Comments

డ్రమ్ సీడర్ తో వరి విత్తు పద్ధతి..

Previous article

జొన్నల వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

Next article

You may also like