ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి అక్కడ పలు కంపెనీల్లో పనిచేసాడు వెంకటేష్. సంపాదన బాగానే ఉన్నా సంతృప్తి చెందలేదు. సొంతూరికి తిరిగివచ్చి తనకున్న ఎకరం పది గుంటల్లో కూరగాయల సాగుకు ఉపక్రమించాడు. ఎనిమిదేళ్లుగా తీరొక్క రకం పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువరైతు సారంగాపూర్ మండలంలోని పెంబట్లకు చెందిన బండారి వెంకటేష్. విదేశాలకి వెళ్ళాడు. అయితే అక్కడ సంపాదన బాగానే ఉన్నా సంతృప్తి చెందలేదు. సొంతూరిలోనే స్థిరపడాలని నిర్ణయించుకుని తిరిగి వచ్చాడు.
తనకున్న ఎకరం పది గుంటల భూమిలో కూరగాయలు సాగు చేశాడు. తొలుత ఆశించిన మేర లాభాలు రాకున్నా నిరాశ చెందలేదు. మరుసటి ఏడాది నుంచి వినూత్న విధానాలు అవలంభిస్తూ తీరొక్క రకాలను వేశాడు. కూర అలిసంత, కాకర, సొరకాయ, బీర, నువ్వులు సాగు చేశాడు. ఇటీవల మూడు గుంటల్లో స్వీట్ కార్న్ వేసి రూ. 18 వేల ఆదాయం గడించాడు. ఈ ఏడాది ఎనిమిది గుంటల్లో పందిరి పద్ధతిలో బీర సాగు చేసి రూ. 48 వేలు ఆర్జించాడు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు రావడంతో ఎనిమిదేళ్లుగా సాగు బాటలో విజయవంతంగా ముందుకెళ్తున్నాడు.
విదేశాల బాట వీడి.. కూరగాయల సాగు
Leave Your Comments