సంప్రదాయానికి ప్రత్యామ్నాయంగా పండించాలంటే కాస్త తెగువ కావాలి. అది కౌలు రైతంటే సాహసమే. ఏకంగా 15 ఎకరాల్లో డ్రమ్ సీడర్ ఉపోయోగించారు. మొలిచిన వరిని పక్షం రోజుల వరకు చూస్తే కళావిహీనంగా ఉంది. పరిసర రైతులు చూసి హేళన చేసేసరికి సాగుదారు ముఖం చాటేశారు. కానీ వెన్నుతట్టిన మండల యువ వ్యవసాయాధికారి చివరి వరకు చూడమని దున్నేయకుండా ఆపడంతో ఇప్పుడు వద్దనుకున్న పైరే వరిచింది. నీటి వనరులు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో వరి సాగు గణనీయంగా పెరిగింది. కోత యంత్రాలు అందుబాటులోకి రావడం ఇందుకు మరింత ఊతమిచ్చింది. నాటు, కలుపు తీసేందుకు కూలీ ఖర్చులే ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించాయి. ఒక్కో కూలీకి రూ. 300 – 500 ఇచ్చినా వచ్చే పరిస్థితి లేదు. రానున్న రోజుల్లో సమస్య మరింత జఠిలంగా మారుతుందని, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించేందుకు రైతులను సన్నద్ధం చేయాలని అటు ప్రభుత్వాలు, ఇటు ఉన్నతాధికారులు సమావేశాల్లో ప్రధానంగా చర్చిస్తున్నారు. వెదజల్లే పద్ధతి లేదంటే డ్రమ్ సీడర్ తో దీన్ని అధిగమించొచ్చని సూచిస్తున్నారు. ఈ విధానం కష్టమని పాతికేళ్ల నుంచి రైతులు ముందుకు రావడం లేదు. యాంత్రీకరణ, యాజమాన్య పద్ధతుల్లో కొద్దిపాటి మార్పులు చేస్తే మల్లారం గ్రామానికి చెందిన కౌలు రైతు మక్బుల్.
మక్బుల్ కు ఐదెకరాల పొలం ఉంది. ఆంధ్రనగర్ లో మరో పదెకరాలు కౌలుకు తీసుకున్నారు. ఇక్కడ ఏడాదికి ఎకరాకు కౌలు రూ. 25 వేలు ఉంది. అంటే ఒక పంట పూర్తిగా కౌలుకే వెళ్తుంది. ఎలాగైనా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే మార్గం చూపమని మండల వ్యవసాయాధికారిను సంప్రదిస్తే డ్రమ్ సీడర్ ద్వారా సాగు మెళకువలు వివరించారు. మొదట్లో విత్తనం ఏరిపడేసినట్లు మొలవడంతో రైతు కంగుతిన్నారు. నెల రోజుల తర్వాత పిలకలేయడం చూసి ఆశ్చర్యపోయారు. నాటే పద్ధతితో పోలిస్తే రెట్టింపు పిలకలొచ్చాయని ఎకరాకు సగటున రూ. 6 – 8 వేల పెట్టుబడి తగ్గి, పది క్వింటాళ్ల దిగుబడి రావడం ఖాయమని భావిస్తున్నారు.
పెట్టుబడి వ్యయాన్ని తగ్గించే మార్గం..డ్రమ్ సీడర్
Leave Your Comments