ఈ నెల పంటచీడపీడల యాజమాన్యంమన వ్యవసాయం

వేరుశనగలో చీడ పీడలు-నివారణ

0
groundnut
                           ఆంధ్రప్రదేశ్‌లో పండించే నూనెగింజల పంటల్లో వేరుశనగ ప్రధానమైన పంట. ఈ పంట ఖరీఫ్‌లో వర్షాధారంగా, రబీలో నీటి పారుదల కింద సాగుచేస్తున్నారు. ఈ పంటను మన రాష్ట్రంలో ఎక్కువగా రాయలసీమ, ఉత్తరకోస్తా జిల్లాల్లో సాగుచేస్తున్నారు. పోషక విలువలు గల వేరుశనగ ఎంతో విస్తీర్ణంలో ఉన్నప్పటికీ, అనేక కారణాల వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. రైతులు ఎంతో శ్రమించి పండిస్తున్నప్పటికీ సరైన యాజమాన్య చర్యులు పాటిస్తే దిగుబడులు పెరిగే అవకాశం ఉంది. ఈ పంటలో చీడల యాజమాన్యం, తెగుళ్ల యాజమాన్యం గురించి తెలుసుకుందాం.
రసం పీల్చు పురుగు :
పేనుబంక :
                     ఇవి చిన్న పరిమాణంలో ఉండి పసుపుపచ్చ లేదా ముదురు ఆకుపచ్చ నుండి నలుపు రంగులో ఉంటాయి. వీటి యొక్క తల్లి, పిల్ల పురుగులు మొక్క లేత భాగాలైన లేత ఆకులు, లేత కాండం, చిగురులు, పూతల నుండి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల మొక్కల ఎదుగుదల ఆగిపోయి గిడసబారి ఉంటాయి. ఆకులు వంకరలు తిరిగి ఉంటాయి. అంతేకాక ఇక ఇవి స్రవించే తేనె వంటి జిగురు పదార్థం వల్ల నల్లటి శిలీంధ్రజాల పెరుగుదల అధికంగా ఉంటుంది. ఆకుల పై నల్లటి మసి పూతను గమనించవచ్చు. అంతేకాక ఇతర వైరస్‌ తెగులుకు వాహకాలుగా పనిచేస్తాయి.
పచ్చదోమ : 
                     వీటి యొక్క తల్లి పిల్ల పురుగులు ఆకుల మధ్య ఈనె భాగాల వద్ద ఉండి రసం పీలుస్తాయి. ఇవి ఆకులలోకి విషపూరిత స్రవాన్ని స్రవించడం వ్ల ఈనెలు తెల్లరంగులోకి  మారి ఆకుల చివర వద్ద ‘‘V’’ ఆకారపు పసుపు పచ్చ మచ్చులు ఏర్పడతాయి. తరువాత ఎరుపు రంగుకు మారుతాయి. దీనివల్ల పంట మొత్తం ఎరుపు రంగుకు మారి కాలిపోయినట్లుగా కనిపిస్తుంది.
తామర పురుగు : 
                      వీటి తల్లి మరియు పిల్ల పురుగు ఆకుల అడుగుభాగాన చేరి మొక్కులు లేత ఆకుల నుండి రసం పీల్చడం వల్ల ఆకు పాలిపోయి తెల్లగా మారి పైకి ముడుచుకుపోతాయి. అధిక స్థాయిలో ఇవి ఆశించినప్పుడు మొక్కలు ఎదుగుదల కోల్పోతాయి. ఇవి బడ్‌నైక్రోసీస్‌ అనే వైరస్‌ వ్యాధికి వాహకాలుగా పనిచేస్తాయి.
నివారణ :
  •  ఇమిడాక్లోప్రిడ్‌ 600 FS 2 మి.లీ. మందుతో ఒక కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేయాలి.
  • వేపకాయల కషాయం (5%) ఒక లీ. చొప్పున 200 లీ. నీటికి కలుపుకుని ఎకరానికి పిచికారీ చేయాలి.
  • మోనోక్రోటోఫాస్‌-300 మి.లీ డైమిధోయెట్‌-300 మి.లీ లేదా మిథైల్‌ డెమటాన్‌-300 మి.లీ లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 60 మి.లీ మందును 200 లీ. నీటికి కలుపుకుని ఎకరానికి పిచికారీ చేయాలి.
  • తామర పురుగు నివారణకు మోనోక్రోటోఫాస్‌ 250 మి.లీ G వేప నూనె 1 లీ. ను 200 లీ. సబ్బు నీటిలో కలిపి ఎకరాకు ప్రతి పది రోజు వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
  • వేపకాయ కషాయం 5% పిచికారీ చేసుకోవాలి.
  • పొలంలో మిత్ర పురుగులను (సాలీళ్లు, అక్షింతల పురుగులు, గొల్ల భామ, క్రైసోపిడ్స్‌) సంరక్షించుకుంటూ వాటి మనుగడను పెంచాలి.
  • మోనోక్రోటోఫాస్‌ 36 SL-300 మి.లీ లేదా డైమిధోయెట్‌ 30 EC- 300 మి.లీ మందును 200 లీ. నీటికి కలుపుకుని ఎకరానికి పిచికారీ చేయాలి.
ఆకుముడత :
                      పిల్ల గొంగళి పురుగులు నల్లని తల కలిగి ఆకుల లోపలు చేరి రెండు మూడు ఆకులను కలిపి వాటిలోని ఆకుపచ్చని పదార్థాన్ని తినడం వల్ల ఆకులపై గోధుమ రంగు మచ్చులు ఏర్పడతాయి. దీని వల్ల ఆకులు ఎండిపోయి కాలిఉన్నట్లు కనిపిస్తాయి దీన్ని అగ్గి తెగుల అని కూడా అంటారు.
నివారణ :
  •  అలసందులు లేదా సోయాబీన్‌ వంటి వాటిని ఎర పంటలుగా వేయాలి. సజ్జను అంతరపంటగా వేసుకోవాలి (7:1)
  • ఎకరాకు 4-5 లింగాకర్షక బుట్టల్ని ఉంచి పురుగు ఉధృతి గమనించాలి.
  • వేప ఆధారిత మందులను (5% వేప కషాయం) ఒక లీ. చొప్పున 200 లీ. నీటికి కలుపుకుని ముందుగా చల్లుకోవాలి.
  • ఎండుగడ్డి మొక్కల వరుసల మధ్య మల్చ్‌గా వేయడం వల్ల పరాన్నభుక్కులు, పరాన్నజీవుల సంఖ్య పెరిగి ఆకుముడత పురుగు ఉధృతి తగ్గుతుంది.
  • క్వినాల్‌ఫాస్‌ 25 EC-400 మి.లీ. లేదా డైమిథోయేట్‌ 30 EC-400 మి.లీ. లేదా క్లోరోఫైరిఫాస్‌ 20 EC-500 మి.లీ లేదా నోవాల్యురన్ 10 EC-200 మి.లీ మందును 200 లీ. నీటికి కలుపుకొని ఎకరానికి పిచికారీ చేయాలి.
ఎర్ర గొంగళి పురుగు : 
                                  పిల్ల పురుగు గట్లపై లేదా పొలంలో ఉన్న గడ్డి మొక్కలను ఆశించి వాటిపై ఉన్న పచ్చదనాన్ని గోకి తింటాయి. వేరుశనగ ఆకులపై పచ్చదనాన్ని కూడా గీకి తింటాయి. బాగా ఎదిగిన గొంగళి పురుగులు ఆకులను తినేసి, రెమ్మలను మొదళ్ళను మాత్రమే మిగుస్తాయి. కొన్ని సందర్భాల్లో పువ్వులను కూడా తింటాయి.
నివారణ :
  •  సామూహిక పంటలు లేదా లైట్లు ఏర్పాటు చేసి రెక్కల పురుగులను ఆకర్షించి అరికట్టవచ్చు. ఎర్ర పంటగా అలసంద, ఆముదం పంటలను వేసుకోవాలి.
  • పొలంలో అక్కడక్కడ వెర్రి ఆముదం, జిల్లెడు మొక్కలను ఎరగా వేసి, ఆకర్షించబడిన గొంగళి పురుగులను నాశనం చేయాలి.
  • పొలం చుట్టూ సాలువేసి ప్రతి మీటరు సాలుకు 250 గ్రా. ఫాలిడాల్‌ పొడిమందు వేసుకోవాలి.
  • గొంగళి పురుగు యొక్క తొలి దశలు గమనించిన వెంటనే ఎకరాకు 1 లీ. వేపనూనెను 200 లీ. నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
  • బాగా ఎదిగిన గొంగళి పురుగులు నివారణకు 400 మి.లీ డైమిథోయేట్‌ లేదా 320 మి.లీ మోనోక్రోటోఫాస్‌ 200 లీ. నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
  • క్వినాల్‌ ఫాస్‌ 1 లీటరు మందు 10 కిలో వరితవుడు మరియు 1 కిలో బెల్లానికి కలిపి విషపు ఎరను తయారుచేసి చిన్న చిన్న ఉండుగా చేసి పొంలో సమానంగా చల్లడం ద్వారా ఈ పురుగును సమర్థవంతంగా అరికట్టవచ్చు.
పొగాకు లద్దె పురుగు :
                            గుడ్ల సముదాయం నుండి అప్పుడే పొదగబడిన లేత పిల్ల లద్దె పురుగు సమూహంగా చేరి లేత ఆకులను పీకి తినడం వల్ల ఆకు జల్లెడగా మారుతాయి. ముదిరిన లద్దెపురుగు ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉండి రాత్రి వేళల్లో ఆకులను తిని, మొక్కల కొమ్మలను మాత్రమే మిగులుస్తాయి. ఈ పగటి వేళ భూమి నెర్రెల్లోనూ, మొక్కల మొదళ్ల వద్ద దాక్కొని ఉంటాయి. తేలికపాటి నేలల్లో ఇవి కాయలకు కూడా నష్టం కలిగిస్తాయి.
నివారణ :
  •  ఆరు తడిగా పంటకు నీరు అందిస్తే మంచిది. గుడ్లు సముదాయాన్ని, పిల్ల పురుగులను ఏరి వేయాలి.
  • రాత్రి సమయంలో సామూహిక మంటలు వేసి ఎర్ర గొంగళి రెక్కల పురుగులను ఆకర్షించి అరికట్టవచ్చును.
  • పొలం చుట్టూ  గుంతలు, సాలు ఏర్పాటు చేసి 250 గ్రా. మిథైల్‌ పెరాథియాన్‌ పొడిని చల్లాలి.
  • ఆముదం, అలసంద వంటి ఎర పంటలను పొలం చుట్టూ వేసుకోవాలి.
  • ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలు పెట్టి  మగరెక్కల పురుగులను ఆకర్షింపజేసి నాశనం చేయాలి.
  • ఎకరాకు 10 పక్షి స్థావరాలను ఏర్పాటు చేయడం ద్వారా గొంగళి పురుగులు పక్షులు తినడం ద్వారా అరికట్టాలి.
  • పిల్ల గొంగళి పురుగులను వేప నూనె 1 లీ. ను 200 లీ. నీటికి కలిపి పిచికారీ చేయడం ద్వారా అరికట్టాలి.
  • విషపు ఎర : పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు విషపు ఎర ముదల్ని వెదజల్లాలి. ఎకరాకు మోనోక్రోటోఫాస్‌ 500 మి.లీ లేదా క్లోరిఫైరిఫాస్‌ 500 మి.లీ మందును 5 కిలో తవుడు, అరకిలో  సరిపడే  కలిపి ఉండుగా చేసి సాయంత్రం సమయంలో వెదజల్లాలి.
వేరుపురుగు : 
ఈ పురుగు ఎక్కువగా తేలికపాటి నేలల్లో, ఖరీఫ్‌ పంటకు ఆశిస్తాయి. తొలకరిలో వర్షాలు పడిన తరువాత తల్లి పురుగులు భూమిలో నుంచి బయటకు వచ్చి వేప లేదా రేగు  చెట్ల పై ఉంటాయి. గొంగళి పురుగు ‘‘C’’ ఆకారంలో తెల్లగా ఉండి  మొక్క వేళ్లను కత్తిరించడం వల్ల మొక్కలు వాడి చనిపోతాయి. మొక్కలు లాగితే సులువుగా ఊడి వస్తాయి. మొక్కలు గుంపులు గుంపులుగా చనిపోతాయి.
నివారణ :
  • విత్తేముందు కిలో విత్తనానికి 6.5 మి.లీ క్లోరిపైరిఫాస్‌ మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలి.
  • విత్తనాు విత్తే ముందు ఫోరేట్‌ 10 శాతం గుళికలను ఎకరాకు 6 కిలోలు వేయాలి.
Leave Your Comments

తూజ మొక్కల సాగు విధానం…

Previous article

పామారోజా గడ్డి సాగుతో .. రైతులకు ఉపాధి

Next article

You may also like