తెలంగాణవార్తలు

దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారి రూ. 2లక్షల రుణమాఫీ 

0
Telangana Rythu Runa Mafi -2024: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారి తమ ప్రభుత్వం రూ. 2లక్షల రుణ మొత్తాన్నీ మాఫీ చేయడం జరుగుతుందని ఈ రోజు (జులై 18 న) ప్రజాభవన్ లో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సదస్సులో ఉపముఖ్యమంత్రితో పాటు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. బ్యాంకింగ్ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని సందర్భమన్నారు.మేము ఈ పథకం ప్రకటించి ఓకేసారి మాఫీ చేస్తామని చెప్పినప్పుడు చాలా మంది బ్యాంకర్లకు కూడా నమ్మకం కుదరలేదు. దానికి కారణం కూడా లేక పోలేదు. గతంలో ఉన్న ప్రభుత్వం రెండు విడతలలో చేసిన మాఫీని మీరు ప్రత్యక్షంగా చూశారు కాబట్టే నమ్మలేదు. అనేక మంది బ్యాంకర్లు కూడా పలు సందర్భాల్లో గత రెండు పర్యాయాలు అమలు చేసిన తీరుతో  రుణమాఫీ వల్ల రైతులకు ప్రయోజనం చేకూరలేదన్న అభిప్రాయాన్ని కూడా  వ్యక్తం చేశారు.
బ్యాంకర్లందరూ భాగస్వామ్యులే…
  1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్న 2లక్షల రుణ మాఫీ వంటి బృహత్తర కార్యక్రమంలో బ్యాంకర్లందరూ భాగస్వామ్యులేనని, ఈ రుణ మాఫీ పధకాన్ని ఆగస్టు కల్లా పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. అన్న మాట ప్రకారం మొదటి విడతలో కుటుంబానికి లక్ష వరకు ఉన్న పంట రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చేస్తామన్నారు.
  2. రైతు రుణాన్ని రెన్యువల్ చేసుకున్నట్లయితే వారికి నగదు రూపంలో ఖాతాలకు జమచేసిన మొత్తాన్ని చెల్లించాలని ఈ సందర్భంగా బ్యాంకర్లందరికీ ప్రభుత్వం తరఫున విజ్ఙప్తి చేశారు.
  3.  ఒకవేళ రైతు పంటరుణాన్ని బాకీ పడ్డట్లైతే వారికి ప్రభుత్వాలు విడుదల చేసిన మొత్తాన్ని రుణం కింద జమ చేసుకొని, కొత్త రుణాన్ని వెంటనే మంజూరు చేయాలి.
  4. ప్రభుత్వం నుంచి పంటరుణమాఫీకి చెల్లించే మొత్తం రైతులకు తప్పకుండా చేరే బాధ్యత ప్రతి ఒక్క బ్యాంకు తీసుకోవాలి. ఆ విధంగా మీ శాఖలన్నింటికి అదేశాలివ్వాలని బ్యాంకర్లకు సూచించారు. ప్యాక్స్ లకి సంబంధించి DCCBలకి విడుదల చేసే మొత్తం ఒకటి లేదా రెండు రోజుల్లో సంబంధిత రైతుల ఖాతాలకు జమ చేయాలన్నారు.
బ్యాంకర్లు సహకరించాలి …
  • వచ్చే నెల రోజులు బ్యాంకులలో రద్దీని తట్టుకొనే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని, రుణాల రెన్యువల్, నగదు చెల్లింపులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయించాలని సూచించారు.
  • రుణమాఫీ 2024 పథకం అమలులో బ్యాంకర్లు పూర్తి సహకారాన్ని అందించాలని, మీ బ్యాంక్ శాఖలకు వచ్చే అధికారులకు పూర్తి సమాచారం ఇవ్వాలని, రైతులకు సహకారం అందించాలని కోరారు. ఏ బ్యాంక్ అయినా ప్రభుత్వ ఉత్తర్వులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోను ఉపేక్షించబోదని వారికి సూచించారు.
  • ఈము పక్షుల మీద పెట్టుబడి పెట్టి నష్ట పోయిన రైతుల రుణాలును OTS స్కీం కింద పరిగణలోకి తీసుకోవాలని, పామ్ ఆయిల్ సాగును చేపట్టే రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.
Leave Your Comments

అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాతావరణ ఆధారిత సూచనలు 

Previous article

ఏపీలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

Next article

You may also like