వార్తలు

కొమ్మ కొమ్మకు కాయలు గుత్తులు, గుత్తులుగా ఆకులకంటే కాయలే..వాటర్ ఆపిల్

0

చెట్టు కొమ్మ కొమ్మకు కాయలు గుత్తులు, గుత్తులుగా ఆకులకంటే కాయలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వేల కాయలతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. కృష్ణా జిల్లా ఘంటసాల మండలం తాడేపల్లికి చెందిన రైతు పరుచూరి సుభాష్ చంద్రబోస్, వసుమతి దంపతులు తూర్పుగోదావరి జిల్లా కడియం నుంచి వాటర్ ఆపిల్ మొక్కను తీసుకొచ్చి దశాబ్ద కిందట తన పెరట్లో నాటారు. అది గత నాలుగేళ్లుగా ఫలాలనిస్తోంది. ఈ ఏడాది శీతాకాలంలో పూత వచ్చి ప్రస్తుతం కొమ్మ కొమ్మకు కాయలు గుత్తులు, గుత్తులుగా కాశాయి. 8 మీటర్లకు పైగా ఎత్తు పెరిగిన ఈ చెట్టు దాదాపు అర తన్ను దిగుబడి ఇచ్చేనందుకు సిద్ధంగా ఉంది. మార్కెట్ లో ఈ పండ్లకు మంచి గిరాకీ ఉన్నప్పటికీ బంధుమిత్రులకు, శ్రేయేభిలాషులకు ఉచితంగా పంపిణీ చేస్తానని ఆయన పేర్కొన్నారు. వేసవిలో దాహార్తిని తీర్చేందుకు ఈ ఫలం ఎంతో ఉపయోగకరమన్నారు. సి విటమిన్ తోపాటు ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయన్నారు. వాటర్ ఆపిల్ చెట్టు సహజంగా వందల సంఖ్యలో కాయలు కాస్తుందని, భూమిలో పోషక విలువలు ఎక్కువగా ఉన్నప్పుడు అరుదుగా ఇలా వేల సంఖ్యలో కాయలు కాస్తాయి.

Leave Your Comments

ఎండాకాలంలో ఈ పండ్ల జ్యూస్ లు తాగాలి..

Previous article

సేంద్రియ పద్ధతిలో 3.5 ఎకరాల్లో 15 రకాల పండ్ల చెట్ల అటవీ..

Next article

You may also like