రైతువేదికలు, నర్సంపేటలో మిరప పరిశోధన కేంద్రంపై శాసనసభలో సభ్యులు రసమయి బాలకిషన్, ఆశన్న గారి జీవన్ రెడ్డి, రామావత్ రవీంద్ర కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు.
“రైతు” రాత మార్చే “వేదిక”లు
ప్రపంచంలో ఇలాంటి ప్రయత్నం ఎక్కడా జరగలేదు.
ఇది జరిగింది తెలంగాణలోనే కేసీఆర్ నాయకత్వంలోనే
వ్యవసాయం మీద పట్టు రావాలంటే ప్రతి అంగుళంలో ఏం జరుగుతుంది అన్నది తెలుస్తుంది.
అందుకే ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది.
అంతకుముందే కేసీఆర్ రైతుబంధు సమితులను ఏర్పాటు చేశారు.
2601 రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం.. 2556 నిర్మాణం పూర్తి.
22 రైతు వేదికలను దాతలు స్వయంగా నిర్మించారు. మంత్రి కేటీఆర్ ఆరు, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ లతో పాటు నేను స్వయంగా రెండు రైతు వేదికలను నిర్మించడం జరిగింది.
రైతులకు నూతన వంగడాలు, నూతన సాగు పద్ధతులు, రైతుల విజయగాధలు వ్యవసాయానికి సమగ్ర అవగాహన కల్పించేందుకు రైతు వేదికలు ఉపయోగపడతాయి.
రైతువేదికలలో రైతులకు నిరంతర శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.
రైతువేదికల పారిశుద్ధ్యం నిర్వహణ పూర్తిగా గ్రామపంచాయతీలదే.. రైతువేదికల నిర్వహణకు నెలకు రూ. 8 వేలు కేటాయిస్తూ ప్రణాళిక రూపొందించడం జరిగింది.
వ్యవసాయ రాష్ట్రంగా పురోగమిస్తున్న తెలంగాణలో రైతుల ఆలోచనా విధానాన్ని మార్చాలన్నదే మా ప్రయత్నం.
జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ ను పరిశీలించి లాభదాయక పంటల సాగు వైపు రైతులను మళ్ళించాల్సిన అవసరం ఉంది.
సాగునీటి వసతితో పాటు వ్యవసాయ అనుకూల విధానాలతో రైతులకు ఊతమిస్తున్న నేపథ్యంలో వారిని నూతన పంటల సాగువైపు మళ్లించడానికి ఇది సరైన సమయం అని భావిస్తున్నాం.
వ్యవసాయం బలోపేతానికి నిరంతర పరిశోధనలు.
కందులు, వేరుశనగ, పత్తి, మిర్చి పరిశోధనలకు కేంద్రాలు.
నర్సంపేటలో మిర్చి పరిశోధనా కేంద్రం ఏర్పాటు విషయం పరిశీలనలో ఉంది.
రైతువేదికలు, నర్సంపేటలో మిరప పరిశోధన కేంద్రంపై శాసనసభలో సభ్యులు రసమయి బాలకిషన్, ఆశన్న గారి జీవన్ రెడ్డి, రామావత్ రవీంద్ర కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిగారు.