Chilli Seedlings: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మిర్చి నర్సరీలు పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. గత సంవత్సరం మిర్చి పంట అధిక ధర పలకడం తో రైతులు మిర్చి పంట వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఈ సంవత్సరం కూడా మిరప ధర పెరుగుతుందన్న ఆశతో రైతులు పెద్ద ఎత్తున మిర్చి పంట వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే చేస్తున్నారు కూడా, ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున మిర్చి నర్సరీలు అక్కడక్కడ వెలిసాయి.
దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తు, మిర్చి విత్తనాలు, నారు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి, లేకపోతే నకిలితో నష్టపోతే బిల్లు లేకపోతే నష్టపరిహారం చెల్లించడం కుదరదని చెబుతున్నారు. మిరప నర్సరీ పెంపకం లాభదాయకంగా మారడంతో రైతులు ఎక్కువగా నర్సరీలను రాయితీలు తీసుకుని మరీ పెంచుతున్నారు. ధరలు ఆశాజనకం గా ఉండటంతో ఈ ఏడాది పలువురు దీనిపై ఆసక్తి చూపుతున్నారు.
గతంలో కొందరు రైతులు ఇష్టారాజ్యంగా నర్సరీలను పెంచడంతో, ఆధికారులు లైసెన్స్ తప్పనిసరి ఉండాలని కోరారు. అంతేకాకుండా నర్సరీలను పెంచేందుకు షేడ్ నెట్ తప్పనిసరిగా ఉండాలి. షేడ్ నెట్ వేసిన తర్వాత ఉద్యానశాఖ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి లైసెన్స్ మంజూరు చేస్తారు. లావు కు మంచి ధర పలకడంతో ఈఏడాది లావు రకం నర్సరీలు పెరుగుతున్నాయి. నర్సరీలో 45 రోజుల తర్వాత మొక్కలు నాటాలి. ఒక మొక్క గత ఏడాది రూ.1.50కి అమ్మారు.
Also Read: సీతాఫలాలు పండిస్తూ లక్షల్లో ఆదాయం.!
చివరి సీజన్ లో రూ. 5 దాకా అమ్మాయి. రైతులు డిమాండ్ ను బట్టి రేటును పెంచుతున్నారు. ధరలపై నియంత్రణ అనేది లేదు. మిరప నారు తో పాటు బంతి నారును కూడా రైతులకు ఉచితంగా ఇవ్వాలి. ఎందుకంటే మిరప తోట లో బంతి మొక్కలు వేయడంతో పురుగులు, క్రిమికీటకాలు ముందుగా బంతి మొక్కలను ఆశిస్తాయి. దీంతో రైతులు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది. ఉద్యానశాఖ, వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించాలి.
విత్తనంలో ఏదైనా తేడా వస్తే రైతుల వద్ద ఉన్న బిల్లుతో కేసు నమోదు చేయించి కంపెనీల నుంచి పరిహారం పొందే ఆవకాశం ఉంటుంది. కాబట్టి బిల్లును తప్పనిసరిగా తీసుకోవాలి. అంతేకాకుండా బిల్లును జాగ్రత్తగా ఉంచుకోవాలి. నర్సరీల్లో మొక్కలు కొనే రైతులకు చాలామందికి రశీదులు ఇవ్వటం లేదు. ఎవరైనా అడిగితే చిన్న కాగితంపై ఎలాంటి వివరాలు లేకుండా రాసిస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకుంటే కల్తీ విత్తనాలను అరికట్టవచ్చు. అప్పుడే రైతులకు నాణ్యమైన పంటను పండించగలరు.
Also Read: ఈ యాసంగికి రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు – మంత్రి