వార్తలు

తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమలకు శుభవార్త..

0

తెలంగాణ రాష్ట్రంలోని గొల్ల కురుమలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ. 3 వేల కోట్లతో మరో మూడు లక్షల యూనిట్లను అందించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్ధిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మాంసోత్పత్తిలో తెలంగాణ స్వయం సమృద్ధి సాధించేందుకు, గొల్ల కురుమల జీవన ప్రమాణాలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున గొర్రెల పంపీణీ చేపట్టిందన్నారు. ఇప్పటి వరకు రూ. 4,854 కోట్లతో 77 లక్షల 2 వేల 737 గొర్రెలను, 3 లక్షల 66 వేల 797 మంది లబ్ధిదారులకు పంపీణీ చేసింది. ఈ గొర్రెలకు భీమా సౌకర్యాన్ని కూడా కల్పించింది. పంపిణీ చేసిన గొర్రెల ద్వారా అదనంగా కోటీ 20 లక్షల గొర్రె పిల్లలు పునరుత్పత్తి అయ్యాయని తెలిపారు.
గీత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం నీరా పాలసీని తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు. దీని కోసం బడ్జెట్ లో రూ. 25 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ. లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం అందిస్తుందన్నారు.

Leave Your Comments

వేసవికాలంలో శక్తి కోసం తీసుకోవాల్సిన జావలు .. తయారీ విధానం

Previous article

భారత జాతీయ సహకార సంఘం అధ్యక్షులు, మాజీ గుజరాత్ మంత్రి, మాజీ ఎంపీ దిలీప్ సంఘానిజీతో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు..

Next article

You may also like