Organic Sugarcane Farming: చెరుక పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి,మొలాసిన్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అధిక చెఱకు దిగుబడి,రసంలో ఎక్కువ పంచదార పొందటానికి ప్రధానంగా శీతోష్ణ స్థితులు, రకం,సాగుభూమి, సాగు పద్ధతులు, సస్యరక్షణ, సాగునీటి నాణ్యత అనే ఆరు అంశాలు ప్రభావితం చేస్తాయి.
నీటి సదుపాయం ఉన్న మెరక భూములు లేదా తోట భూములు అనువైనవి. తేమను పోషకాలను ఎక్కువగా నిలుపుకోలేని తెలికనేలలను సేంద్రియ పదార్థాలువేసి అభివృధి పరచి చెఱకు నాటు కోవాలి . సారహీనమైన, లోతు తక్కువ కలిగి నేల పైపోరా గట్టి పడే భూము లను లోతైన దుక్కిచేసి ఎకరాకు 1 టన్ను పొడిగా చేసిన వేరుసెనగ తొక్కలను లేక వారి ఊక వేసి అభివృద్ధి పరచుకోవాలి . పాల చౌడభూముల్లో చెఱకు నాటేటపుడు, ముందుగా లవణాలను మురుగు నీటి కలవ ద్వారా తిసివేయాలి. లవణ పరిమితి నేలలో సెంటి మీటరుకు 2 మీలీ మోస్ లకన్నా ఎక్కువ ఉండకూడదు. క్షారభుములకు జిప్సం వేసి అభివృధి పరచి నాటుకోవాలి రేగుర్ నేలలో నిజామాబాదు, చల్క భూముల్లో 45 సెం.మీ. వరకు లోతు దుక్కి చేస్తే వేళ్ళ వ్యాప్తి బాగా ఉంటుంది.
పూత పూయని చెరుక చిగురు భాగంగాని, 7-8 నెలల వయస్సు గల లేవడి తోటల చెరుకును గాని మూడు కళ్ళ ముచ్చెలుగా కొట్టి విత్తనంగా వాడాలి . లేవడి తోటలను పెంచేందుకు ముదురు తోగుల నుంచి సేకరించిన గడలను మొదలు, చివర 1/3 భాగాలకు తీసివేసి మూడు కళ్ళ ముచ్చెలుగా చేసి, వేడి నీటిలో 52 సెల్సియస్ వద్ద 30 నిముషాలు లేదా తేమతో మిళితమైన వేడి గాలి 54 సెల్సియస్ వద్ద 4 గంటలు విత్తన శుద్ధి చేయాలి . వేడి నీటి విత్తన శుద్ధి ద్వారా కాటుక, గడ్డిదుబ్బ, ఆకుమాడు తేగుళ్ళను అరికట్టవచ్చు.
Also Read: PJTSAU: పీజేటీఎస్ఏయూలో ఘనంగా ముగిసిన చర్చా కార్యాక్రమం.!
కోస్తా ఆంధ్రాలో జనవరి – మార్చి మాసాల్లో, తెలంగాణాలోని ఎక్సాలి పంటను డిసంబర్ జనవరిలో ఆడాల్సి ఆగష్టు, సెప్టెంబర్లోను, రాయలసీమ ప్రాంతంలో జనవరి, ఫెబ్రవరిలోను నాటుకోవచ్చు. ముందుగా ఆడుటకు నవంబరు, జనవరి , మధ్యకాలంలో ఆడుటకు ఫెబ్రవరి – మార్చి, ఆలస్యంగా ఆడుటకు మార్చి లో అనువైన రకాలను క్రమంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాల్లో నాటుకోవాలి .
నేలను 25-30 సెం .మీ లోతు వరకు ఇనుప నాగలితో దున్ని మెత్తటి దుక్కి చేయాలి 4-6 వారాలకు ముందు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 5 టన్నుల బాగా ఆరిన పొడి ఫిల్టర్ మడ్డి వేసి కలియ దున్నాలి. చదును చేసిన తరవాత కాలువలను, బోదెలను రిడ్జ్మర్ లేదా రెక్కల నాగలితో వేసుకోవాలి. కాలువ వెడల్పు 30 సెం .మీ లోతు 20 సెం మీ వుండాలి . చాళ్ళ మద్య స్వల్పకాలిక 80 సెం .మీ మద్యకాలిక రకాలకు 90 సెం .మీ ఆలస్యంగా వర్షాధారంగా నాటే చెఱకు కు 60 సెం.మీ ఎడం ఉండాలి.
పచ్చిరొట్ట ఎరువులు:
పొలంలో పైరు లేనపుడు పచ్చిరొట్ట పైర్లు జనుము, జీలుగ, పిల్లి పెసర పెంచుకొని 50 శాతము పుత దసలో ఉన్నపుడు భూమిలో కలియ దున్నాలి.
సేంద్రియ ఎరువులు:
4-6 వారాలకు ముందు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువు లేదా 5 టన్నుల బాగా ఆరిన పొడి ఫిల్టర్ మడ్డి వేసి కలియ దున్నాలి. నత్రజని నందించే జీవన ఎరువులైన అజటోబాక్టర్ 2 కిలోలు ఎకరాకు లేదా అజోస్పైరిల్లం 4 కిలోలు ఎకరాకు 500 కిలోల పశువుల ఎరువులో కలిపి 2 దఫాలుగా నాటిన మూడవ రోజున సగభాగం నాటిన 45 వ రోజున మిగిలిన సగభాగాన్ని వేసుకోన్నట్లితే నత్రజని ఎరువుల్లో షుమారు 25 శాతం వరకు తగ్గించుకోవచ్చు. అలాగే ఎకరాకు 4 కిలోల ఫాస్ఫో బాక్టీరియా ముచ్చెలు నాటిన తరువాత ఆరవ రోజున జివ తడి ఇచ్చేముందు వేసుకుంటే భాస్వరపు ఎరువుల్లో షుమారు 25 శాతం వరకు ఆదా చేయవచ్చు.
పంట మొదటి నాలుగు నెలల్లో బాల్యదశ ఆరు రోజులకొకసారి, పక్వదశలో నవంబరు నుండి చెఱకు నరికే వరకు మూడు వారాలకొకసారి నీరు పెట్టాలి. బిందు సేద్యపద్ధతి అవలంభించడం వలన పరిమిత నీటి వనరులను పొదుపుగా వాడుకోవచ్చును జంట పాళ్ళ పద్దతిలో 2.5*3.5 చెరుకు సాగు చేసినప్పుడు, బిందు సేద్యపద్ధతి లో ఖర్చును తగిన్చుకోవచ్చును. నీటి ఎద్దడి పరిస్థితుల్లో చెరుకు నాటిన 3 వ రోజు ఎకరాకు 1.25 టన్నుల చొప్పున చెత్త కప్పటం ద్వారా భూమిలోని తేమ త్వరగా కోల్పోకుండా నివారించడంలో బాటు కలుపు, పీక పురుగుల ఉదృతి తగ్గించవచ్చు .
ఈ యూరియా, మ్యురేట్ ఆఫ్ పోటాష్ 2.5 శాతాన్ని పైరు మీద పిచికారి చేయాలి . చెరువుల క్రింద వర్షాధారంగా సాగుచేసినపుడు, చెఱకు తోటకు బాల్య దశలో మొదటి తడిపెట్టిన 30 రోజులకు రెండవ తడిని పెట్టడం మంచిది వర్షాకాలంలో తోటల్లో నీరు నిల్వకుండా చూడాలి. మురుగునీటి కాల్వల ద్వారా గాని, నత్తగుల్ల లేదా ఆర్కిమెడిస్ సు ద్వారా నీటిని త్వరగా తీసివేయాలి. సాగునిటిలో లవణాల సాంద్రత అధికంగా ఉన్నపుడు 2 మి.ల్లీ మోస్లు సెం.మీ.కు, సోడియం కార్బోనేట్ అవశేషం లీటరు కు 5 మి.ల్లీ ఈక్వివలెంట్ల కన్నా అధికంగా ఉన్నపుడు పంచదార దిగుబడులు రసనాణ్యత తగ్గుతాయి.
Also Read: Drip Irrigation: డ్రిప్ ద్వారా నీటిని అందించడం లో పాటించాల్సిన మెళకువలు.!