World’s Expensive Mango ‘Miyazaki’ : సహజంగా మామిడి పండు ధర ఎంత ఉంటుంది. కిలో రూ. 100 నుంచి రూ.400 వరకు ఉంటుందని అందరికీ తెలిసిందే. మామిడి పండు ధర లక్షల్లో ఉంటుందని సహజంగా ఎవరూ నమ్మరు, కానీ నమ్మి తీరాల్సిందే. ప్రపంచంలోనే అత్యత ఖరీదైన మామిడి పండ్లను పండిస్తూ పశ్చిమబెంగాల్ లోని సిలిగురి రైతు వార్తల్లో నిలిచారు. ఇంతకీ ఆ మామిడి పండు ధర ఎంతో తెలుసుకుందాం.
చాలా అరుదైన మామిడి అందుకే ఇంత ధర
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగురి జిల్లా మాటిగరా మాల్ లో ప్రతి సంవత్సరం మ్యాంగో ఫెస్టివల్ నిర్వహిస్తూ ఉంటారు. మోడల్లా కేర్ టేకర్ స్కూల్ ఈ ఫెస్టివల్ నిర్వహిస్తుంది. ఈ ఏడాది జరిపిన ఏడవ ఎడిషన్ ఫెస్టివల్ లో 262 రకాల మామిడి పండ్లు ప్రదర్శనకు ఉంచారు. వాటిలో జపాన్ దేశంలో పుట్టిన మియాజాకీ రకం అందరినీ ఆకర్షించింది. ఇప్పటికే ఈ రకం ప్రపంచంలోనే అత్యధిక ధర పలుకుతోంది.
ఒక్కో మామిడి పండు 350 గ్రాములు తూగుతుంది. గరిష్ఠంగా ఒక్కోసారి 900 గ్రాములు కూడా బరువు తూగుతుంది. మియాజాకీ మామిడి కిలో రూ.2.75 లక్షల ధర పలికింది. ఇది తెలుసుకుని నెటిజన్లు నోరెళ్లబెట్టారు. కొందరైతే అసలు ఇది నిజమేనా అంటూ కామెంట్లు చేశారు. ఇది నిజం. ఈ వార్తలో ఎలాంటి అసత్యం లేదు. ఎందుకంట్లే అందరి ముందే నిర్వహించిన వేలంలో మియాజాకీ మామిడికి గరిష్ఠ ధర దక్కింది. ఇది మొదటిసారి కూడా కాదు. ఏటా ఈ రకం పండ్లకు మంచి ధర దక్కుతుంది. ప్రపంచంలోనే అత్యధిక ధర కూడా ఈ మామిడి పండు సొంతం.
Also Read: Punasa Mangoes: ఏడాదిలో రెండుసార్లు కాపు నిచ్చే పునాస మామిడి..
మియాజాకీ మామిడి ప్రత్యేకత ఏమిటి?
మియాజాకీ మామిడి జపాన్ దేశంలో పుట్టింది. అనేక దేశాలకు విస్తరించింది. సాధారణ వాతావరణంలో పెరుగుతుంది. 25 నుంచి 48 డిగ్రీల వేడిని తట్టుకుని పంట ఇస్తుంది. అటు జపాన్ రైతులు కూడా ఈ రకం మామిడి సాగు చేస్తున్నారు. గత సంవత్సరం జపాన్ లో నిర్వహించిన వేలంలో మియాజాకీ మామిడి పండ్లను కిలో రూ.2 లక్షలకు కొనుగోలు చేశారు. అప్పట్లో ఇదో సంచలనం. ప్రపంచంలోనే అత్యధిక ధరల రికార్డులను చెరపడంలో మియాజాకీని మించిన పండు లేదు. అందుకే రైతులు ఈ మొక్కల కోసం నెట్లో తెగ వెతుకుతున్నారు. కొందరు రైతులు ఇప్పటికే ఈ మొక్కలు సాగు చేసి లక్షలు ఆర్జిస్తున్నారు.
ఛత్తీస్ ఘడ్ లోనూ సాగు చేసిన రైతు
మియాజాకీ మామిడి చత్తీస్ ఘడ్ రైతు కూడా సాగు చేశారు. గతంలో మియాజాకీ మామిడి చెట్ల పండ్లకు ఇద్దరు గన్ మెన్లను కాపాలాగా ఉంచిన ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో మియాజారీ మామిడి గురించి రైతులు సెర్చ్ చేయడం ప్రారంభించారు. ఈ మొక్కలు ఎక్కడ లభిస్తాయంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నాయి. అయతే మియాజాకీ మొక్కలు సేకరించడం అంత ఈజీ కాదు. దీని పేరు చెప్పి కొందరు మోసాలకు కూడా పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: Miyazaki Mango: ఒక కిలో మామిడి పండ్లలు 2. 70 లక్షలు… ఎలా సాగు చేయాలో తెలుసుకోండి.!