వార్తలు

వరి కంకులతో అందాలు..గౌరవ డాక్టరేట్

0

గుంటూరు జిల్లా బాపట్లలో సాధారణ రైతు కుంటుంబానికి చెందిన సింగంశెట్టి శివనాగేశ్వరమ్మ వివాహానికి ముందు ఏడో తరగతితో చదువు ముగించారు. సుమారు 40 ఏళ్ల తరువాత ఇటీవల ఓపెన్ యూనివర్శిటీలో బీకాం పూర్తి చేశారు. వరి కంకులకు సృజనను అద్ది ఖండాలను సృష్టిస్తున్న ఆమెను గౌరవ డాక్టరేట్ వరించింది. విజ్ఞాన, పారిశ్రామిక, కళారంగాల్లో పరిశీలనాత్మక పరిశోధనలు చేసిన వారికి అందించే గౌరవ డాక్టరేట్ ను యునైటెడ్ థియోలాజికల్ రీసెర్చ్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఫ్రేడ్రిక్ ఫ్రాన్సిస్ అందించారు. గ్రామీణుల జీవనం అన్నప్రాసన నుంచి మరణం వరకు వరి ధాన్యంతోనే ముడిపడి ఉంటుంది. అంతటి ప్రాశస్త్యం గల వరి కంకులు, గడ్డిపోచలతో అందాలొలికే అపురూప ఆకృతుల్ని అల్లుతూ శివనాగేశ్వరమ్మ అందరి మన్ననలు ఒడ్ల కుచ్చులు, వరి కంకుల తోరణాలు, హారాలు, బొకేలు, గడ్డిపోచలతో బొమ్మలు, బౌద్ధ స్థూపాలు, నమూనాలు, భావపురి భావదేవుని గాలి గోపురం, బాపట్ల గడియార స్థంభం, పెళ్లి పల్లకి, మీనా, ఒడ్లపురి చుట్టిల్లు, పూరిళ్లు, తెరచాప పడవలు, దేవతలా దుస్తులను తయారు చేసిన ఆమె వాటిని వివిధ ఆలయాలకు అందించారు, ఔరా అనిపించే ఆమె నైపుణ్యానికి డాక్టరేట్ వరించింది. ఆమె కళా సృజనకు ఇది కొత్త స్ఫూర్తినిచ్చింది. వేమూరు మండలం పెరవలి చెందిన ఎస్ ఎస్ రంగయ్య కుమారుడు సుబ్బారావు ను 1978 లో ఆమె వివాహం చేసుకున్నారు. అనంతరం బాపట్ల రైలు పేటలో కుమార్తెలు, ఇద్దరు కుమారులు, వరి కంకులు, గడ్డిపోచలతో తయారుచేసే అనేక ఆకృతులు కోసం బీపీటీ రకానికి చెందిన వరి కంకులు, గడ్డి పోచలను ఉపయోగిస్తున్నామని శివనాగేశ్వరమ్మ తెలిపారు. వరి కోతకు వారం రోజులు ముందుగా కావాల్సిన వరి కంకులను ఎంపిక చేసుకుని పొలం నిలువుపై కోత కోసి తెచ్చిన వరి పనలను నీడలో ఆరబెడతారు. ఈ విధంగా చేయడం వల్ల కంకుల్లో గింజలు రాలకుండా ఉంటాయి. గడ్డి పోచల్లో పెళుసుదనం లేకుండా మెత్తగా ఎంతకాలమైనా వుంటాయని చెబుతున్నారు శివనాగేశ్వరమ్మ.

Leave Your Comments

డ్రిప్ ద్వారా నేరుగా సేంద్రియ ఎరువును మొక్కలకు పంపిణీ..

Previous article

వ్యవసాయ సామాగ్రికి సొంత పరిజ్ఞానం జోడించి యంత్ర తయారీ..రైతు రవీందర్

Next article

You may also like