ఉద్యానశోభ

Spine Gourd Pickles: పచ్చళ్ల తయారీకి ఉపయోగిస్తున్న ఆగాకర.!

1
Spine Gourd Pickles
Spine Gourd

Spine Gourd Pickles: తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యం పొందిన తీగజాతి కూరగాయలలో ఆగాకర. వినడానికి కొత్తగా ఉంది కదా. గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రమే పరిమితమైన ఈ పంట పట్ల వినియోగదారుల్లో పెరిగిన అవగాహన వినియోగం పెరగడంతో మార్కెట్లో అత్యధిక గిరాకి పంట గా పేరుగాంచింది. ఆగాకరను బొడ కాకర, బొంత కాకర అని కూడా పిలుస్తారు.. కూరగాయగాను పచ్చళ్ల తయారీ గాను మంచి రుచి కాయగూరగా పేరు పొందింది. దీనిని బహు వార్షిక పంటగా వేస్తారు రైతులు. ఇది ఒక్క తీగజాతి కాయగూర. గతంలో పాక్షిక పందిర్లపై పండించే వారు. ప్రస్తుత్తం దీనిని శాశ్వత నిర్మాణలపై పండింస్తున్నారు. ఒక్కసారి నాటితే రెండు, మూడు సంవత్సరాల దాకా దిగుబడినిస్తుంది.. సారవంతమైన ఎర్రనేలలు, గరప నేలలు, ఇసుక నేలలు, ఈ పంట సాగుకు అనుకూలం..

ఆగాకరలో అంతర పంటలు

ప్రస్తుత కాలంలో చిన్న సన్నకారు రైతులకు సంవత్సరం పొడవునా ఆదాయాన్ని సమకూర్చే కూరగాయల సాగుకు ఆదరణ పెరుగుతుంది.. ముఖ్యంగా అన్ని కాలాల్లో అనువైన తీగజాతి కూరగాయల సాగు విస్తీర్ణం పెరుగుతుంది..దీనిలో భాగంగానే ఆగాకర సాగు చేస్తున్నారు.. దీనిని కూరగాయగా భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలలో ఉపయోగిస్తారు. ఇది కాకర జాతికి సంబంధించిన. కాకరకాయలా పొడవుగా ఉండదు. పొట్టిగా గుండ్రముగా పై ముళ్ళ లాంటి తోలుతో ఉంటుంది. ఆంధ్ర, అస్సాం, గుజరాత్, ఒడిశా, మహారాష్ట్ర వంటకాలలో దీనిని వాడతారు. కాకరకాయ పోల్చితే చేదు తక్కువగా ఉంటుంది, మే నెలలో విత్తనం నాటి జులై రెండో వారంలో దిగుబడులు తీస్తున్నారు. పంట తక్కువగా ఉంటే రేటు ఎక్కువగా పలుకుతుంది.. అక్టోబర్ వరకు కాయించి దానిలో కాకర, బీర, సొర వంటి అంతర పంటలు వేస్తున్నారు.

Also Read: Rooftop Tomato Farming: ఇంటి పైకప్పు పై టమాట సాగు.!

Spine Gourd Pickles

Spine Gourd Pickles

అగాకర నల్లన ఆరోగ్యానికి ప్రయోజనాలు..

ఆగాకరలో మంచి పోషకాలున్నాయి. బి విటమిన్, పీచు పదార్థం కెరోటిన్, ప్రొటీన్లు అధికంగా ఉన్నాయి. అందువల్ల మధుమేహం, మలబద్దక నివారణకు మంచి ఆహారం గా పనిచేస్తుంది. చర్మసంబంధ వ్యాధులు దగ్గు, ఆయాసం, శ్వాస వ్యాధులు, అల్సర్లు, ఫైల్స్, కామెర్లు, కాలేయం మూత్ర సంబంధ వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది.. అధిక వర్షపాతం, అధికతేమ, అధిక ఉష్ణోగ్రతలు గల ప్రాంతంలో ఈపంట అధిక దిగుబడిని ఇస్తుండటంతో తెలుగు రాష్ట్రాల రైతులు ఈసాగు చేయడానికి ముందుకు వస్తున్నారు.. ఎకరాకు 3 నుండి 4 టన్నుల వరకు దిగుబడిని సాధించడం తో ఆర్థికంగా మంచి ఫలితాలు పొందుతున్నారు.. మార్కెటులో ఆగాకర కిలో రూ 150 నుండి 200 దాకా పలుకుతున్నాయి.

ఉద్యానశాఖ సబ్సిడి

బంగ్లాదేశ్‌, భారతదేశంతోపాటు, ఎత్తైన కొండ గుట్టల్లో, సహజ సిద్ధంగా పెరుగుతుంది. ముఖ్యంగా అస్సాం, ఒరిస్సా, బీహార్‌, బెంగాల్‌ రాష్ట్రాల్లో,పంజాబ్‌, ఉత్తర ప్రదేశ్‌ రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర కేరళలో ఉంది. కొండ ప్రాంతాలలో సహజనిద్ధంగా తీగలా అల్లుకొని కాయలు కాసే కూరగాయ. ఈమధ్య కాలంలోనే దీనిని సాగులోకి తేవటం ద్వారా రైతులు ఆదాయాన్ని పొందుతున్నారు. గాకర సాగు పందిరికి ఉద్యాన శాఖ సబ్సిడీ అందిస్తుంది.. దీనిని రైతులు ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.

Also Read: Poultry Management: వర్షాకాలంలో కోళ్ల ఫారాల్లో తీసుకోవలసిన జాగ్రత్తలు.!

Leave Your Comments

Rooftop Tomato Farming: ఇంటి పైకప్పు పై టమాట సాగు.!

Previous article

Backyard Curry Leaves Farming: ఇంటి పెరట్లో కరివేపాకును పెంచుతున్న రైతులు.!

Next article

You may also like