Orchid Floriculture: కంటికి అందంగా ఆకర్షణీయంగా కనిపించే ఎటువంటి పూల కైనా బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. వీటిలో కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండే పూలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకాకుండా పూలు నిల్వ కోసం ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటున్నారు. దీనిలో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఈ పూలకు మంచి డిమాండ్ ఏర్పడింది. వీటిని శుభకార్యాలలో కూడా ఉపయోగిస్తున్నారు. దీనిలో భాగంగా ఆర్కిడేసి పూలకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఏర్పడింది..
సంవత్సరానికి మూడు, నాలుగు సార్లు పూసే అవకాశం
ఆర్కిడేసి అనేది ఒక ఉష్ణమండల మొక్క, దీనిలో 25000కు పైగా సహజ జాతులు, 200000 పైగా హైబ్రిడ్ లు ఉన్నాయి. ఈ పుష్పాలు పలు రంగులలో వికసిస్తాయి. ఆర్కిడేసి అనేది ఒక్క దీర్ఘకాలిక పుష్పాలు, అత్యంత అందమైన పువ్వులలో ఇది ఒక్కటి.. ఈ పువ్వు సంవత్సరానికి ఒకటి, రెండు సార్లు వికసిస్తాయి. పువ్వులు మాత్రం రెండు, మూడు నెలల పాటు నిల్వ ఉంటాయి. ఆర్కిడ్లు కుండీల్లో పెంచాలంటే అధిక సూర్యకాంతి అవసరం. సరైన కాంతి, తేమ, ఉష్ణోగ్రత ఉంటే ఈ పువ్వులు సంవత్సరానికి మూడు, నాలుగు సార్లు పూసే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా పాలిహౌస్ లో ఈ పంట సిరులు కురిపిస్తుంది. దీంతో ఎకరానికి 20 లక్షలు సంపాదించవచ్చు అంటే అతిశయోక్తి కాదు..
Also Read: Natural Cultivation: సహజ సాగులో 1.30 ఎకరాల్లో వైవిధ్య పంటలు.!
ఈ పంటలపై రైతులకు శిక్షణ
ఆర్కిడేసి పూలు మనకు సిరులను కురిపిస్తుంది..అంతేకాకుండా ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉంటాయి. తెలుపు, గులాభి రంగులతో అందరిని ఆకట్టుకుంటున్నాయి. దేశీయంగా కొరత వల్లన థాయిలాండ్ నుండి పూలను ఎగుమతి చేసుకుంటున్నారు. ఆర్కిడేసి పూలలో కొన్ని వందల రకాలు ఉన్నప్పటికిని అధిక వాణిజ్య విలువలు కలిగిన రకాలను సాగు చేస్తున్నారు.. హైదరాబాద్ లోని జీడిమెట్ల లో ఏర్పాటుచేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో 2017 లో ప్రయోగాత్మకంగా ఈ పూలసాగు చేపట్టి విజయం సాధించారు. ప్రస్తుతం ఈ పంటలపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు.. ఉద్యానశాఖ అద్యర్యంలో పంటలను సాగుచేసి దానిమీద మొలకపవలుతో రైతులకు చూపిస్తున్నారు..
1000 మొక్కలకు 6 లక్షల ఆదాయం
చల్లని వాతావరణం అధిక తేమ ఉన్న ప్రాంతాల్లో పెరిగే ఈ పంటను ఆరుబయట పెంచడం వీలు కాదు. కాబట్టి పాలీహౌస్ లో వాతావరణాన్ని నియంత్రించి సాగు చేపట్టే విధంగా వీలు ఉండటం, డిమాండ్ ను బట్టి ఒక్కో కట్ ఫ్లవర్ ధర రూ 10 నుండి 50 దాకా పలుకుతుంది.. ఆర్కిడేసి పూలసాగు అనేది రైతులకు చాలా ఆశాజనకంగా ఉంది.. పావు ఎకరంలో 1000 మొక్కలు సరిపోతాయి. దీని ద్వారా 6 లక్షల ఆదాయాన్ని పొందవచ్చు. సాగు నిర్వహణ ఖర్చు లక్షకు మించడం లేదు. కాబట్టి 5లక్షలు నికర ఆదాయం పొందే అవకాశం ఉంది. ఈ పంటకు పెట్టిన పెట్టుబడిని రెండవ సంవత్సరంలో పొందే అవకాశం ఉంది. ఈ పూలు అవేని మనకు కొరత కాబట్టి రైతులు ఈ పూల సాగుకు దృష్టి మళ్లించి మంచి లాభాలు ఆర్జించాలని ఉద్యాన శాఖ అధికారులు కోరుతున్నారు..
Also Read: Importance of Floriculture: పూల పెంపకం ప్రాముఖ్యత.!