How to Soften Cookies: గత కొద్దీ రోజుల నుంచి వాతావరణం చల్లగా ఉంటుంది. చల్లగా ఉండటం వల్ల బిస్కెట్లు, కుకీలు తొందరగా మెత్తగా మారుతాయి. వాటిని తిన్న కూడా అంత రుచిగా ఉండవు. వర్షాకాలంలో బిస్కెట్లు, కుకీలు ఎంత జాగ్రత్తగా నిల్వ చేసిన కూడా మెత్తగా అవుతుంటాయి. వీటిని సరిగ్గా నిల్వ చేయకపోతే బిస్కెట్లు, కుకీలు మెత్తగా మారి వాటి పై బాక్టీరియా, వైరస్ తొందరగా వ్యాపించే అవకాశం ఉంది. వర్షాకాలంలో బిస్కెట్లు, కుకీలు ఎలా నిల్వ చేసుకోవాలి…?
వర్షాకాలంలో బిస్కెట్లు, కుకీలలోకి గాలికి ప్రవేశం లేని డబ్బాలో పెట్టుకోవాలి. సాధారణంగా బిస్కెట్లు, కుకీలు ప్లాస్టిక్, అల్యూమినిముం డబ్బాలో పెడుతారు. కానీ వాటిలోకి గాలి ప్రవేశించి బిస్కెట్లు, కుకీలు మెత్తగా మారుతాయి. మెత్తగా మారిన బిస్కెట్లు, కుకీలు రుచి కోల్పోవడంతో తినడానికి వీలు లేకుండా ఉంటాయి.
బిస్కెట్లు, కుకీలను ప్లాస్టిక్, అల్యూమినిముం డబ్బాలో పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు డబ్బా అడుగు భాగంలో రెండు లేదా మూడు లేయర్ టిష్యూ పేపర్ వేసుకోవాలి. టిష్యూ పేపర్ పై బిస్కెట్లు, కుకీలను పెట్టి మళ్ళీ వాటి పై రెండు లేదా మూడు లేయర్ టిష్యూ పేపర్ వేసుకోవాలి. ఆ తర్వాత డబ్బాకి మూత పెట్టాలి. ఇలా బిస్కెట్లు, కుకీలను నిల్వ ఉంచడం వల్ల ఎక్కువ కాలం క్రిస్పీగా, నాణ్యతగా ఉంటాయి.
బిస్కెట్లు, కుకీలు మెత్తగా మారకుండా ఉండటానికి మరో ఉపాయం జిప్ పౌచ్ వాడటం. బిస్కెట్లు, కుకీలను జిప్ పౌచ్‌లో నిల్వ ఉంచడం వల్ల మెత్తగా మారకుండా, రుచి కూడా తగ్గకుండా ఎక్కువ కాలం ఉంటాయి. జిప్ పౌచ్ లేని వాళ్ళు ప్లాస్టిక్ పౌచ్ కూడా వాడుకోవచ్చు. జిప్ పౌచ్ లేదా ప్లాస్టిక్ పౌచ్ అందుబాటులో లేని వాళ్ళు ఇంటిలో ఉండే గాజు సీసాలో కూడా నిల్వ చేసుకోవచ్చు. గాజు సేసా గాలిని, తేమని పీల్చుకోదు. అందువల్ల బిస్కెట్లు, కుకీలు క్రిస్పీగా, రుచిగా చాలా రోజులు ఉంటాయి.
మీ ఇంటిలో కూడా బిస్కెట్లు, కుకీలు వర్షాకాలంలో మెత్తగా అవుతుంటే పైన ఉన్న చిట్కాలని వాడుకొని ఎక్కువ రోజులు నిల్వ చేసుకోండి.
Also Read: Grafting in Brinjal: అంటుకట్టు విధానంలో వంకాయ సాగు ఎలా చేయాలి…?