వార్తలు

Eco-friendly Houses: వ్యవసాయ వ్యర్ధాలతో ఎకో ఫ్రెండ్లీ ఇళ్ల నిర్మాణం.!

1
Eco-friendly Houses
Eco-friendly Home

Eco-friendly Houses: ధనవంతుల నుంచి పేదవాడి వరకు ప్రతి ఒక్కరికి వాళ్ళ సొంత ఇల్లు కట్టుకోవాలి అని ఒక కల ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కాలంలో సొంత ఇల్లు కట్టుకోవడం మాములు విషయం కాదు. కానీ ఒక అమ్మాయి ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కట్టుకునే కలని సాధ్యం చేస్తుంది. శృతి తనకి సొంత ఇల్లు ఉండాలి అనుకున్న కల ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టి ఇవ్వాలి అని నిర్ణయం తీసుకుంది. ఒక స్టార్టప్‌ ప్రారంభించింది. అందరికి కొన్నగల్గిన ధరకే ఇల్లు కట్టి ఇస్తుంది.

కానీ ఆమె కట్టి ఇల్లు వ్యవసాయ వ్యర్థాల నుంచి కడుతుంది. గడ్డితో తయారు చేసిన కంప్రెస్డ్ ఎంజీ ఫైబర్‌ను వాడుకుంటూ ఇల్లు కడుతుంది. అందుకే ఈ స్టార్టుప్ కంపెనీకి స్ట్రక్చర్ ఎకో అని అంటున్నారు. ఈ ఇల్లు కట్టడం వల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు.

Also Read: Intercropping: తక్కువ భూమిలో ఎక్కువ పంటలని పండించడం ఎలా.. ?

Eco-friendly Houses

Eco-friendly Houses

ఈ ఇళ్ళకి పంట అవశేషాలతో తయారు చేసిన ఇటుకలను వాడుతారు. ఈ ఇళ్ల కట్టడం నాలుగు వారాలలో పూర్తి అవుతుంది. ఎక్కువ వర్షాలకు, గాలుల వల్ల ఈ ఇళ్ళకి ఎటువంటి ప్రభావం ఉండదు. కరోనా సమయంలో బీహార్ రాజధాని పాట్నాలో 80 రోజుల్లో ఆసుపత్రిని కట్టింది.

తాను మొదలు పెట్టిన స్టార్టుప్ కంపెనీతో ప్రజలకు సొంత ఇల్లు కట్టి వారి స్థాయిని మార్చాలనుకుంది. అందుకే తాను మొదలు పెట్టిన కంపెనీలోకి చాలా మంది రైతులని చేర్చుకుంది. ఈ స్ట్రక్చర్ ఎకో ద్వారా ప్రజల కల నిరవేర్చిన్నందుకు యూత్ అసెంబ్లీ అవార్డు, యుపిలో స్టేట్స్ అవార్డు, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్, ఐఐఎం బెంగళూరులో అవార్డులను అందుకున్నారు. ఫోర్బ్స్ అండర్ 30 ఎంటర్‌ప్రెన్యూర్‌లో కూడా శృతి చోటు దక్కించుకుంది

Also Read: Sheep Farming: పొటేళ్ల పెంపకంలో భారీ లాభాలు ఎలా సంపాదించుకోవాలి..?

Leave Your Comments

Intercropping: తక్కువ భూమిలో ఎక్కువ పంటలని పండించడం ఎలా.. ?

Previous article

Yarsagumba Mushroom: ఈ రకం పుట్టగొడుగులు కిలో 20 లక్షలు.!

Next article

You may also like