Soil Fertility: రైతులు దిగుబడి ఎక్కువ రావాలి అని పొలంలో ఎరువులు, పురుగుల మందులు ఎక్కువ వాడడం వల్ల ఇప్పుడు పంట పొలాలు పనికి రాకుండా పోతున్నాయి. ఒక ఎకరానికి ఒక బస్తా లేదా సగం బస్తా వాడాల్సిన ఎరువులు, ఎక్కువ దిగుబడి, పంట తొందరగా చేతికి వస్తుంది అన్న ఆశతో పది బస్తాల ఎరువులని వాడడంతో పొలంలోని సారం మొత్తం తగ్గి పోతుంది.
ఎక్కువ ఎరువులు వేయడం ద్వారా కూడా ఎం లాభం లేదు మొక్కకి కావాల్సిన పోషకాల వరకు తీసుకొని మిగితాది అంతా పొలంలోనే వదిలేస్తుంది. మిగిలిన ఎరువులు పొలంలో ఉండి పోవడంతో ఆ ఎరువులు పొలాన్ని యాసిడ్ పొలంలా మారిపోతుంది. పొలం pH యాసిడ్ గా మారడం ద్వారా నేల నాణ్యత కూలిపోతుంది, ఆ నేలలో పంటలు కూడా పండించడానికి వాడుకోలేము.
Also Read: Pashu Kisan Credit Card: పశు క్రెడిట్ కార్డు స్కీం రైతులు ఎలా వాడుకోవాలి.!
ఇలాంటి పరిస్థుతుల నుంచి రైతులకి రాకుండా ఉండాలి అంటే రైతులు తన పొలంలో పంట కోతలు పూర్తి చేసుకున్నాక , తన పొలంలో నేల సూక్ష్మ జీవులు వృద్ధి చేయడానికి జీలుగ, జనుము పిల్లిపెసర పంటలు వేయాలి. ఈ పంటలు సాగు చేయడం ద్వారా భూమి గుల్లగా మారి నీరు తొందరగా ఇంకుతుంది. ఈ సూక్ష్మ జీవుల వల్ల నేల సారం పెరుగుతుంది, నేల ఆరోగ్యంగా కూడా ఉంటుంది.
ఈ పచ్చిరొట్ట ఎరువులను వర్షాకాలం మొదటిలో వేసుకోవాలి. వర్షాలు వచ్చి, ఈ పంటని భూమిలో కలిపి దున్నడం ద్వారా భూసారం పెరుగుతుంది. తర్వాత పంటల దిగుబడి పెరుగుతుంది. పొలంలో తేమ, పోషకాలు కూడా పెరుగుతాయి. ఈ జీలుగ, జనుము పిల్లిపెసర పంటలు వేసుకోవడం కూడా చాలా సులువు. ఈ పంటలు వేసుకోవడానికి ఖర్చు, మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ.
ఈ పంటలు వేయడం వల్ల నేలలో నీరు ఇంకే గుణం, నేల సారం కూడా పెరుగుతుంది. జీలుగ, జనుము పిల్లిపెసర పంటలు వేసుకోవడం ద్వారా నేల సారం రెండు మూడు పంటల వరకు ఎలాంటి ఎరువులు వాడుకున్న కూడా రైతులకి మంచి దిగుబడి, నేల సారం కూడా తగ్గకుండా ఉంటుంది.
Also Read: Biodegradable Products: బయో డిగ్రేడబుల్ వస్తువులని మాత్రమే వాడాలి.!