Urban Kisan: ఈ కొన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేయాలి అని మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఇంటిలో కూడా ఉన్న కొంచం స్థలంలో కూడా మొక్కలు పెంచడం మొదలు పెట్టారు. కనీసం ఎవరి ఇంటికి సరిపోయే కూరగాయలు లేదా పండ్ల మొక్కలని పెంచుతున్నారు. ఇంటి ముందు స్థలం లేని వాళ్ళు టెర్రస్ పై మొక్కలు పెంచుతున్నారు. మనం చూసే చుటూ పక్కన ఇళ్లలో కూడా చాలా మంది టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో టెర్రస్ గార్డెనింగ్ పద్దతి ఎక్కువగా వాడుతున్నారు. చాలా మంది టెర్రస్ గార్డెనింగ్ చేయాలి అనుకుంటున్నారు కానీ వాళ్ళకి సరైన అవగాహన లేక గార్డెనింగ్ మొదలు పెట్టలేకపోతున్నారు. మీరు సరైన సలహాలతో, మీ టెర్రస్ సరిపోయే డిజైన్లతో టెర్రస్ గార్డెనింగ్ చేయడానికి హైదరాబాద్ నుంచి ఒక టెర్రస్ గర్దెనెర్ అయిన విహారి , అర్బన్ కిసాన్ అనే పేరుతో ఒక స్టార్ట్ ఆప్ కంపెనీ ప్రారంభించి ఎంతో మంది గార్డెనింగ్ కోరికకు అనుకుణంగా డిజైన్స్ చేస్తున్నారు.
ఈ అర్బన్ కిసాన్ స్టార్ట్ ఆప్ కంపెనీ మీకు ఉండే స్థలం, టెర్రస్ పై గార్డెన్‌ను ఏర్పాటు చేస్తారు. మీరు టెర్రస్ గార్డెనింగ్ చేయాలి అనుకుంటే ఈ కంపెనీతో కాంటాక్ట్ చేస్తే మీ స్థలంలోకి వచ్చి సైట్లో ఉన్న పరిస్థితులని చూసి వాటికీ అనుకుణంగా గార్డెన్ ఏర్పాటు చేస్తారు. గార్డెన్ మొక్కలకి నీటి సదుపాయంతో పాటు మొక్కలు వేయడానికి సలహాలు కూడా ఇస్తారు.
Also Read: Garlic Cultivation: ఎకరాకు 50 క్వింటాళ్ల దిగుబడి ఇచ్చే వెల్లుల్లి సాగు.!
గార్డెనింగ్ ఏర్పాటు చేశాక గార్డెనింగ్ మనకి అలవాటు పడే వరకి మనకి సలహాలు ఇస్తుంటారు. మన ఇంటి స్థలంలో చిన్నదైన, పెద్దదైన గార్డెనింగ్ ఏర్పాటు చేస్తారు. మనకి ఇష్టమైన మొక్కలని పెంచడానికి ఎలాంటి పోషకాలు అందించాలని అవగాహన అందిస్తారు. విదేశీ పద్దతిలో కూడా గార్డెర్కింగ్ ఏర్పాటు చేస్తారు. హడ్రోఫోనిక్ పద్దతిలో గార్డెన్ మొక్కలు పెంచడానికి సంస్థ ప్రతినిధుల సలహాతో మనం ఏర్పాటు చేసుకోవచ్చు. తెలుగురాష్ట్రాలకు ప్లాన్ లో కూడా అందుబాటులో ఉంటారు.
ఈ హడ్రోఫోనిక్ విధానంలో వ్యవసాయం పై అధ్యయం చేసిన తరువాత స్టార్ట్ ఆప్ కంపెనీ పెట్టాలని అనుకుంటున్నారు. ఈ పద్దతి ద్వారా 95 శాతం నీళ్లు లేకుండానే మొక్కలను పెంచోచ్చు. ఇప్పటికే మనలో చాలా మందికి టెర్రస్ గార్డెన్ పెంచుతూ ఉంటారు కాని వాటిని ఒక పద్దతిలో ఎలా పెంచాలో ఎలా మనకున్న రిసోర్స్ పెంచాలో అనేది వాళ్ళ సంస్థ గైడ్ చేస్తోంది. గార్డెన్ ఆర్గనైజ్ చేయడంతోపాటు హడ్రోఫోనిక్ పద్దతిలో మొక్కలను పెంచాడానికి సహాకారం అందిస్తోంది అర్బన్ కిసాన్ స్టార్ట్ ఆప్ కంపెనీ.
Also Read: Biofertilizers: జీవన ఎరువులు వాడే పద్ధతుల గురించి తప్పక తెలుసుకోవలసిన విషయాలు.!