వార్తలు

దేశంలో పసుపు ధర రికార్డ్ స్థాయిలో..

0

ప్రపంచవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ తో పసుపు వాడకం పెరిగింది. విదేశాలకు కూడా ఎగుమతులు పెరుగుతున్నాయి. దీంతో పసుపు పంట రికార్డ్ ధర పలుకుతోంది. పసుపు సాగు చేస్తున్న రైతులకు గుడ్ న్యూస్.. దేశంలో పసుపు ధర రికార్డ్ స్థాయికి చేరింది. మహారాష్ట్రలోని సంగ్లీ మార్కెట్లో నాణ్యమైన పసుపు క్వింటాల్ ధర రూ. 30 వేలు పలికింది. పసుపు ఈ స్థాయిలో ధర పలకడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కర్ణాటకలోని బెళగాని జిల్లాకు చెందిన ఓ రైతు సేలం వంగడానికి చెందిన మూడున్నర క్వింటాళ్ల పసుపును శుద్ధి చేసి సంగ్లీ మార్కెట్ కు తీసుకొచ్చారు. ఆయనకు రూ. 1.05 లక్షలు వచ్చాయి. కరోనా ఎఫెక్ట్ తో ప్రపంచవ్యాప్తంగా పసుపు వాడకం పెరగడం ఈ ఏడాది దిగుబడి తగ్గే అవకాశం ఉండటంతో పసుపు ధర అమాంతం పెరుగుతోంది. 2020 జనవరి – డిసెంబర్ మధ్య భారత్ నుంచి 1,81,664 టన్నుల పసుపును విదేశాలకు ఎగుమతయ్యింది. 2021 లో ఎగుమతులు మరింత పెరిగి 2.30 లక్షల టన్నులకు చేరే అవకాశం ఉంది.
మహారాష్ట్ర, తమిళనాడుల్లో క్వింటాల్ పసుపు సగటు ధర రూ.12 -14 వేల మధ్య ఉంటుండగా.. నిజామాబాద్ లో రూ.10 వేలు దాటింది. నిజామాబాద్ ప్రాంతంలో అత్యంత నాణ్యమైన పసుపు సాగవుతుంది. కానీ ఇక్కడ ధర అంతంత మాత్రంగానే ఉంటుండటంతో రైతులు పొరుగున వున్న మహారాష్ట్రలోని సంగ్లీ మార్కెట్లో పంటను విక్రయిస్తున్నారు.

Leave Your Comments

టమాటాలో శనగ పచ్చ పురుగు – నివారణ

Previous article

కవర్ టెక్నాలజీతో.. మామిడిలో దిగుబడి

Next article

You may also like