Watermelon: పుచ్చకాయను మొట్ట మొదటగా ఈజిప్టులో 5 వేల సంవత్సరాల క్రితమే పండిరచిన ఆధారాలున్నాయని. భారత దేశంలో సా.శ. 4వ శతాబ్దాంలో వచ్చిందని చెపుతారు. శుశ్రుతుడు తన ‘శుశ్రుత సంహిత’లో సింధూ నదీతీరంలో దీన్ని విరివిగా పండిరచినట్లు పేర్కొన్నాడు. అందులో దీన్ని ‘కళింద’ లేదా ‘కళింగ’గా పేరుతో పేర్కొన్నాడు. చైనా మరియు జపాన్ దేశాలలో ఇంటికి వచ్చే అతిధులు ఎక్కువగా తెచ్చే బహుమతి పుచ్చకాయ.
సాగు చేయడానికి అనుకూల వాతావరణం :
అన్ని రకాల కాలాలలో వీటిని సాగు చేస్తున్నారు కానీ పొడిగా ఉండే ఉష్ణ వాతావరణంలో పుచ్చ అధికంగా దిగుబడిని వస్తుంది. వేసవి కాలంలో లభ్యమయ్యే వాటికి నాణ్యత, రుచీ ఎక్కువ. ‘‘బి’’ విటమిన్లు, పొటాషియం పుష్కలంగా ఉండే పుచ్చకాయ నుంచి ఎలక్ట్రోలైట్లు సమృద్ధిగా అందుతాయి.
పుచ్చలో పోషక పదార్థాలు :
ముదురు ఎరుపు లేక గులాబీ రంగు ఉన్న పుచ్చకాయ గుజ్జులో కెరోటినాయిడ్స్, బీటాకెరోటిన్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటితో పాటు విటమిన్-బి6, విటమిన్-సి, పీచు పదార్థాలు కూడా దొరుకుతాయి. సుక్రోజ్తో పాటు కొంత మేరకు ఫ్రక్టోజ్, గ్లూకోజ్లు ఇందులో లభిస్తాయి. ‘‘బి’’ విటమిన్లు శరీరానికి శక్తి నందిస్తే పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. మిగిలిన పండ్ల కన్నా వీటిలో నీటి శాతం ఎక్కువ కాబట్టి వడదెబ్బ బారినపడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన చర్మానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే తిరిగి చర్మం నిగారింపు సంతరించుకుంటుంది.
సాగుకు అనువైన రకాలు :
ప్రపంచ వ్యాప్తంగా 1200 పుచ్చరకాల్ని పండిస్తున్నారు. వాటిల్లో ప్రముఖంగా పండిరచే రకాలు నూర్జహాన్, షర్బత్-ఎ-అనార్, అనార్కలీ, షుగర్బేబీ (మహారాష్ట్రలోని అధికంగా పండిచే అమెరికా రకం), అసాహీ యమటో (పశ్చిమ బెంగాల్లోని అధికంగా పండిచే జపాన్ రకం), నందారి (ఆంధ్రప్రదేశ్‌లో అధికంగా పండిరచే రకం), రెడ్ టైగర్, ఆల్ స్వీట్, వాల్ పెయింట్.
పుచ్చను ఆశించు చీడ పీడలు`సస్య రక్షణ చర్యలు : ఈ పంటను తొలి దశ నుండి కోతకు వచ్చే దశ వరకు వివిధ రకాల పురుగులు, తెగుళ్ళు మరియు నులిపురుగులు ఆశించి నష్టపరుస్తాయి. దీనివలన పంట దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి రైతులు సకాలంలో సమయానికి అనుగుణంగా వివిధ రకాల చర్యలు చేపడుతూ చీడపీడల నివారించేనట్లైతే అధిక దిగుబడును సాధించవచ్చు.
పుచ్చను ఆశించు పురుగులు :
1. పండు ఈగ :
పండు ఈగ తల్లి పురుగులు పూత దశలో ఎక్కువ ఆశించి పువ్వుల పైన గుడ్లు పెడతాయి. ఈ గ్రుడ్ల నుండి వచ్చిన పిల్ల పురుగులు పూత మరియు మొగ్గలలోకి చేరి కాయలు తిని నష్టపరుస్తాయి.
నివారణ :
వీటి నివారణకు మలాథియాన్ 2 ఎశ్రీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి అలాగే పురుగు యొక్క ఉనికిని తెలుసుకోవడానికి ఎకరానికి రెండు లింగాకర్షిక బుట్టలను ఏర్పాటు చేసుకొని కుళ్ళిన కాయలను తీసివేయాలి వీటిని బ్యాక్టీరియా ఆశించి పూర్తిగా కుళ్ళేటట్లు చేసి నష్టాన్ని తీవ్రతరం చేస్తాయి.
విషపు ఎర తయారీ :
రైతు తన పంట పొలం వద్దే ఈ విషపు ఎరను తయారు చేసుకోవచ్చు దీనికోసం మలాథియాన్ 100 ఎశ్రీ మరియు చక్కెర లేదా బెల్లం 100 గ్రా. 10 లీటర్ల నీటిలో కలిపి మట్టి మూకుడులో పోసి ఎకరాకి 10-12 చోట్లలో పెట్టాలి. ఇవి తల్లి పురుగులను ఆకర్షిస్తాయి. కళ్ళు మడ్డి కలిపితే ఈగలు ఇంకా ఎక్కువగా ఆకర్షించబడి తిని చనిపోతాయి లేదంటే మార్కెట్లో లభ్యమయ్యే విషపు ఎరలను కోవచ్చును.
2. పెంకు పురుగులు :
తల్లి పురుగులు మొలకెత్తిన తర్వాత వచ్చిన లేత పత్ర దళాలను ఆశించి ఆకులపై రంధ్రాలు చేసి నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ పురుగులు తీగపాకే సమయంలో ఆకుల మీద అధికంగా నష్టాన్ని కలిగిస్తాయి.
నివారణ :
వీటి నివారణకు ట్రైకోఫోరాన్ 5 శాతం పొడి మందుని ఆకులపౖౖెన చల్లాలి లేదా ట్రైకోఫోరాన్ 2 ఎశ్రీ లీటరు కలిపి పిచికారి చేయాలి.
3. ఆకు తినే గొంగళి పురుగులు :
ఈ గొంగళి పురుగులు పంట యొక్క వివిధ దశలో ఆశించి ఆకులను తిని పత్రాలను నష్టపరుస్తాయి. వివిధ దశలో పంటను ఆశించడం వలన మొక్క ఎదగక దిగుబడి తగ్గుతుంది.
నివారణ :
ఈ పురుగు నివారణకు 1 గ్రా. థయోడికార్బ్‌ను లేదా 2 మి.లీ. క్లోరిపైరిఫాస్‌ను ఒక లీటరు నీటికి కలిపి పూత దశకు ముందు పిచికారి చేయాలి.
నులి పురుగులు :
ఈ నులి పురుగులు వేరు యొక్క దిగువ భాగంలో వేరును బుడిపెలుగా మార్చి నష్టపరుస్తాయి. దీని వలన మొక్కలు వడలిపోయి చనిపోతాయి.
నివారణ :
ఈ పురుగులు ఎక్కువగా ఉన్నప్పుడు 3 గ్రా.కార్బోసల్ఫాన్ అనే రసానిక మందును కిలో విత్తనానికి పట్టించి విత్తన శుద్ధి చేసుకోవాలి. మొక్క యొక్క మొదలు దగ్గర వేప పిండిని వేసుకోవాలి.
Also Read: Punarnava: పునర్నవతో పుష్కలమైన లాభాలు.!
తెగుళ్లు :
బూడిద తెగులు :
వాతావరణ పరిస్థితులు రాత్రిపూట చల్లగా మరియు పగలు వేడిగా ఉన్నప్పుడు ఈ తెగులు ఉధృతి ఎక్కువగా అవుతుంది. ఈ తెగులు ఎక్కువగా పూత దశలో ఆశిస్తుంది. మొదటగా లేత ఆకులపైన బూజు లాంటి పదార్థంగా ఆశిస్తుంది. తర్వాత పూత, కాండం పైన, పూల మీద మరియు చిరు పిందెల మీద తెల్లని బూజు వస్తుంది. దీని వల్ల పూత మరియు కాయలు రాలిపోతాయి.
నివారణ :
దీని నివారణ కోసం మొగ్గలు మరియు పూత దశలో తెగులు కనిపిస్తే మాంకోజెబ్ 1.5 గ్రా. లేదా హెక్సాకొనజోల్ 2 మి.లీ. లేదా ప్రొపికొనజోల్ ఒక మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
బూజు తెగులు :
ఈ తెగులు ఆశించినప్పుడు మొదట్లో ఆకుల మీద ఆకుపచ్చ మరియు ముదురు ఆకుపచ్చ కలిసినటువంటి మచ్చలు కనిపిస్తుంది. తర్వాత ఆకులపై పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ ఆకులు ఎండిపోయి రాలిపోతాయి. వర్షంతో కూడిన చల్లని వాతావరణం తెగులు వ్యాప్తికి అనుకూలం.
నివారణ :
దీని నివారణకు 2 గ్రాముల మెటలాక్సిల్ లేదా 2.5 గ్రా. మాంకోజేబ్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పక్షికన్ను తెగులు :
ఆకులు మరియు కాయల మీద పక్షి కన్ను వంటి గుండ్రటి మచ్చలు ఏర్పడతాయి ఈ భాగంలో ఆకులు ఎండిపోయి రాలిపోతుంది.
నివారణ :
దీని నివారణకు 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 1 గ్రా. కార్బన్డిజం లేదా 2 గ్రా. కార్బన్డిజం, మాంకోజబ్ కలిపిన మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
వెర్రి తెగులు :
ఈ తెగులు ఆశించిన ఆకులు ఈనెల మధ్య మందంగా చారలుగా ఏర్పడి పొలుసుగా మారి గిడశబారిపోతాయి. దీని వలన పూత మరియు పిందె ఏర్పడటం ఆగిపోతుంది.
నివారణ :
దీని నివారణకు మొక్కలను పీకి నాశనం చేయాలి లేదా కాల్చివేయాలి. ఈ తెగులు పెనుబంక ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి పెనుబంక నివారణకు 2 ఎశ్రీ డైమిథోయేట్ లేదా మిథియాల్ డెమిటాన్ లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి.
Also Read: Stevia: షుగర్ రోగులకు చక్కటి శుభవార్త.. చక్కర బదులు స్టీవియా!